తిమ్మాజిపేట, డిసెంబర్ 20: కొత్త టీవీ ఇన్స్టాల్ చేసేందుకు గూగుల్లో టీవీ కంపెనీ టోల్ నెంబర్కు బదులు పొరుపాటుగా మరో నెంబర్కు ప్రయత్నించిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని తన ఖాతా నుంచి రూ.5లక్షలు పొగొట్టుకోగా, మరో ఘటనలో ఆర్మీ జవాను రూ.94 వేలు పోగొట్టుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం తి మ్మాజిపేట మండలకేంద్రానికి చెందిన రాముశర్మ స్కీంలో చేరితే అతడికి వాషింగ్ మిషన్ వచ్చింది. దాని బదులు సోమవారం స్మార్ట్ టీవీ తీసుకున్న అతను ఇన్స్టాల్ చేసేందుకు కస్టమర్ కేర్ నెంబర్కు బదులు వేరే నెంబర్కు ఫోన్ చేయగా, సైబర్ నేరగాడు లైన్లోకి వచ్చి మనిషిని పంపుతామని రెండు రూపాయలు ఫోన్ పే చేయమని చెప్పాడు. ఫోన్ పే లో డబ్బులు వెళ్లకపోవడంతో ఫోన్లో ఒక యా ప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. దీంతో అత ను చెప్పిన యాప్ను రాముశర్న డౌన్లోడ్ చేసుకున్నాడు.
అది ఎనీడెస్క్ యాప్ అని తెలియని రాము అతడు చెప్పినట్లు చేశాడు. చివరికి ఏటీఎం కార్డు నెంబర్, సీవీవీ చెప్పిన బాధితుడు సోమవారం సాయంత్రం తన బ్యాంకు ఖాతా నుంచి రూ.50వేలు డ్రా కావడం గమనించాడు. ఇదేమని ప్రశ్నించగా, అతడు తిరిగి రూ.లక్ష వేసి, మళ్లీ డ్రా చేసుకున్నాడు. రాత్రి 8 గంటల వరకు రాముతో ఫోన్లో మాట్లాడుతూనే పలుమార్లు డబ్బులు డ్రా చేశాడు. మొత్తం 15 ట్రాన్జాక్షన్లలో రూ.5.02లక్షలు ఖాతా నుంచి తీసుకున్నా డు. ఆలస్యంగా గమనించిన రాము అతడికి ఫోన్ చేయగా రాత్రికి వేస్తానని నమ్మబలికాడు. తిరిగి ఫోన్ చేయగా మం గళవారం ఉదయం వేస్తానని చెప్పాడు. ఇలా మధ్యాహ్నం 12గంటల వరకు ఫోన్లో మాట్లాడిన అతడు, తర్వాత స్పందించడం మానేశాడు. తాను మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసులు, సైబర్ క్రైం పోలీసులకు ఫి ర్యాదు చేశాడు. మరో ఘటనలో మండల కేంద్రానికి చెంది న ఆర్మీ జవాను నుంచి ఇన్సూరెన్స్ పేరిట రూ.94వేలు సైబర్ నేరగాళ్లు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.