నారాయణపేట టౌన్, నవంబర్ 27 : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వివిధ అంశాలపై నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కిడ్స్ హోం మాంటిస్సోరీ పాఠశాల నిర్వాహకులు వరలక్ష్మి, రజిని అన్నారు. సహపాఠ్య కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని కిడ్స్ హోం మాంటిస్సోరీ పాఠశాలలో ఆదివారం పాఠశాల సం త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే మార్కెటింగ్, సామాజి క జాగరూకత, బ్యాం కింగ్, ఆర్థిక అంశాల ని ర్వహణ తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో సేంద్రియ కూరగాయలు, పండ్లు, పూ లు, కిరాణం, స్టేషనరీ, వెదురు వస్తువులు, అల్పాహారం, టీ, కాపీ, స్వగృహ ఫుడ్స్ తదిదర వస్తువులను విక్రయించా రు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వస్తువుల ను కొనుగోలు చేశారు.