మహబూబ్‌నగర్, నవంబర్ 25 : టెక్నాలజీని అందిపుచ్చుకు ని మేథస్సుతో ప్రపంచమంతా తెలిసేలా పా లమూరు బిడ్డ అడుగు లు వేస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసించి.. గోవాలోని బి ట్స్ పిలానీ ఎలక్ట్రాని క్స్, ఇంజినీరింగ్ పూర్తి చేసి.. వివిధ కంపెనీల్లో ప నిచేసి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.. మానస న ర్సింగ్ హోం ఎండీ డాక్టర్ నందన్ కుమారుడు ఏ గూర్ అబ్బాయి. ధ్రువ స్పేస్ ప్రైవేటు సంస్థలో డై రెక్టర్ అండ్ సీటీవోగా కొనసాగుతున్నాడు. ప్రయోగాలు చేయడంలో దిట్టగా పేరొందాడు. శనివారం ఉదయం 11:56 గంటలకు ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న షార్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నింగిలోకి రాకెట్‌ను ప్రవేశపెట్టనున్నది. అయితే, ప్రైవేటు సంస్థ అయిన ధ్రువ రూపొందించిన ఓ ఎర్త్ పవర్ బిట్‌ను షార్ రాకెట్ స్పేస్‌లోకి తీసుకెళ్లనున్నది.
భూమి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో వీటిని కక్షలో ఉంచనున్నారు. నింగిలో ప్రవేశపెట్టిన రెండు శాటిలైట్లు హోం రేడియో కమ్యూనిటీకి హెల్ప్ చేయనున్నది. ధ్రువ స్పేస్ కంపెనీ దీన్ని పర్యవేక్షించనున్నది. రాకెట్ ప్రయోగంలో ఏగూర్ అబ్బాయి భాగస్వామి కానున్నాడు. ధృవ స్పేస్ ద్వారా నింగిలోకి రెండు శాటిలైట్లను, ఓ ఎర్త్ పవర్ బిట్‌ను షార్ రాకెట్ ఆధారంగా నింగిలోకి ప్రవేశపెట్టడం సంతోషంగా ఉం దని యువ శాస్త్రవేత్త సంతోషం వ్యక్తం చేశాడు. ఇ దో గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. రా బోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలు చేస్తానని స్ప ష్టం చేశారు. పాలమూరు పేరు దేశమంతా వినిపించడం ఆనందంగా ఉందన్నాడు.