దేవరకద్ర రూరల్/మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 25 : ఆపత్కాలంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవ రూ అధైర్యపడొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ముచ్చింతలకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, అడ్డాకుల మండలం శాఖాపూర్‌కు చెందిన రాజమూరి అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయం తె లుసుకున్న ఎమ్మెల్యే ఆల.. శుక్రవారం దవాఖానకు వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని దవాఖాన వైద్యులకు సూచించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా చిన్నచింతకుంట మండలం కురుమూర్తికి చెందిన శంకరమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల అందజేశారు. కార్యక్రమంలో హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
పీఏసీసీఎస్ చైర్మన్‌కు పరామర్శ
దేవరకద్ర, నవంబర్ 25 : దేవరకద్ర సింగిల్‌విండో చైర్మన్ డోకూర్ నరేందర్‌రెడ్డి తండ్రి చిన్న హన్మిరెడ్డి ఇటీవల మృతి చెందా డు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన ఏకాదశ దినకర్మకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై నరేందర్‌రెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకుముం దు హన్మిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీలు రామాదేవి, హర్షవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కో యిల్‌సాగర్ ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, సత్యంసాగర్, గురుప్రసాద్, గోపాల్ ఉన్నారు.
సదర్ ఉత్సవాలు ప్రారంభం
భూత్పూర్, నవంబర్ 25 : భూత్పూర్ రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాలను ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షుడు కృ ష్ణయ్య, రామస్వామి, సురేశ్ పాల్గొన్నారు.