మహబూబ్‌నగర్, నవంబర్ 21 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) :జోగుళాంబ గద్వాల జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా రెండు పడక గదుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా జిల్లాకు 1300 ఇండ్లు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రానికి అత్యంత చేరువలో విలువైన జాగాలో చేపట్టిన నిర్మాణాలు నడిగడ్డకే మణిహారంగా నిలిచాయి. ఇండ్లు కేటాయిస్తే తమకు రాజకీయ పుట్టగతులుండవని భావించి అభివృద్ధిని అడ్డుపడేందుకు ప్రయత్నించిన అరాచక శక్తులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిప్పికొట్టారు. త్వరలోనే లబ్ధిదారులకు కేటాయింపు జరుపనున్న నేపథ్యంలో హర్షం వ్యక్తమవుతున్నది.
గద్వాల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జ రుగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రంలోని ఖరీదైన ప్రదేశంలో డబు ల్ బెడ్రూం ఇండ్లు కడుతున్నారు. ఇవి జిల్లా కేంద్రానికే మణిహారంగా నిలుస్తున్నాయి. ‘డబుల్’ ఇండ్లు ఆకాశహర్మ్యాలను తలపిస్తున్నాయి. ఈ ఇండ్లు పంపిణీ చేస్తే తమకు రాజకీయ పుట్టగతులు ఉండవని భా వించిన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎమ్మెల్యే బండ్ల కృ ష్ణమోహన్రెడ్డి ప్రయత్నానికి అడ్డు తగులుతున్నా రు. వారి కుట్రలను ఎమ్మెల్యే పటాపంచలు చేశా రు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జోగుళాంబ గ ద్వాలకు సీఎం కేసీఆర్ రూ.వందల కోట్ల నిధులు వెచ్చించారు. సుమారు 1,300 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న పరమాల శివారులోని 72 ఎకరాల ప్ర భుత్వ స్థలంలో ఇప్పటివరకు 560 ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా.. మరో 715 ఇండ్లు తుదిదశలో ఉన్నాయి. గొన్పాడు గ్రామంలో 25 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయి. అన్ని ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాక సీ ఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పం పిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ప్ర త్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇటు కృష్ణ, అటు తుంగభధ్ర నదుల మధ్య ఉన్న గద్వాల ప్రాంతం నడిగడ్డగా పేరుగాంచింది. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు రాష్ట్రంలో చక్రం తిప్పినా.. ఈ నియోజకవర్గ తలరాత మారలేదు. ప్రజల ఆకాంక్ష మే రకు సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశా రు. అప్పటినుంచి రూపురేఖలు మారిపోయాయి.
ఏడాదిలోనే ఆర్వోబీ పూర్తి..
2014 నుంచి 2018 వరకు ఎన్ని నిధులు వె చ్చించినా.. అప్పటి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు వాటిని పెండింగ్‌లో పెట్టించి రాజకీయ డ్రామాకు తెరలేపారు. ప్రజల సమస్యలను గాలికొదిలేశారు. దీంతో ప్రజలు తిరగబడి.. అభివృద్ధే పరమావధి గా పనిచేస్తున్న టీఆర్ఎస్కు నియోజకవర్గంలో ప ట్టం కట్టారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే అ య్యాక బంగ్లా అక్రమాలకు అడ్డకట్టవేశారు. దీం తో ఉక్కిరిబిక్కిరి అయిన డీకే కుటుంబం ఏకంగా పార్టీనే మార్చేసింది. ఎనిమిదేండ్లుగా ప్రజలు అవస్థలు పడుతున్న ఆర్వోబీ నిర్మాణాన్ని ముఖ్యమం త్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏడాదిలోగా పూర్తి చేయించారు. ప్రజలను ట్రాఫిక్ కష్టాలనుంచి గట్టెక్కించారు. దీంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
సీఎం సహకారంతోనే సాధ్యం..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక మారుమూ ల పట్టణాలకు మహర్దశ ఏర్పడింది. గ ద్వాలను తమ రాజకీయ భవిష్యత్‌కు అ డ్డాగా మార్చుకున్న కొన్ని శక్తులకు నడిగడ్డ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కా ర్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే 1300 డబుల్ బెడ్రూం ఇండ్లను క ట్టిస్తున్నాం. ప్రస్తుతం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక సీ ఎం కేసీఆర్ చేతులమీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తాం.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల