మిద్దె తోటల సాగుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్య పంటల సాగువేగంగా విస్తరిస్తున్నది. బాల్కానీల్లో, మిద్దెల మీద ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలను రసాయన ఎరువులు వాడకుండా సాగు చేస్తున్నారు. ఇండ్లల్లోనే వారి అభిరుచుల మేరకు తోటలను సాగు చేస్తున్నారు. రెండేండ్లుగా ఈ కల్చర్ బాగా పెరిగింది. ఇదే క్రమంలో జడ్చర్లలో హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం ప్రారంభమైంది. టీఆర్ఎస్ నేత బాద్మి శివకుమార్ మట్టి అవసరం లేకుండా తక్కువ నీటితో తోటల సాగు మొదలుపెట్టాడు. యూట్యూబ్ వీడియోల్లో పరిశోధన చేయడంతోపాటు హైడ్రోఫోనిక్స్ సాగు పద్ధతులపై షోలాపూర్‌కు చెందిన నిపుణుడి వద్ద ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నారు. పాలకూర, తోటకూర, బచ్చల కూర, మెంతికూర, టమాట,స్ట్రాబెర్రీ, తులసీ, బేసిల్ మొక్కలు, బర్గర్లు, పిజ్జాల్లో వాడే లేట్యూస్ ఆకులతోపాటు 15 వందలకు పైగా మొక్కల పెంపకం చేపట్టాడు. తగిన మోతాదులో ఊష్ణోగ్రత అందేలా గ్రీన్షెడ్డ్ ఏర్పాటు చేశారు.
జడ్చర్లటౌన్, నవంబర్ 20 : కరోనా నే పథ్యంలో విధించిన లాక్డౌన్లో ప్ర తి ఒక్కరూ ఇండ్లకే పరిమితమయ్యా రు. ఎవరికి వారు ఇండ్లలోనే ఉం టూ తమ అభిరుచుల మేరకు పను లు చేసుకున్నారు. ఈ క్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ వ్యవసాయంలో కొత్త మెళకువలు పాటిస్తూ జడ్చర్లలోని తన ఇంటి ఆవరణలో హైడ్రోఫోనిక్స్ వ్యవసాయాన్ని ప్రారంభించారు. మట్టి అవసరం లేకుండా.. తక్కువ నీటితో మొక్కలు పెంచేందుకు యూట్యూబ్‌లో పరిశోధన చేశారు. ఈ వ్యవసాయం పద్ధతులపై సో లాపూర్‌కు చెందిన వ్యవసాయ నిపుణుడి ద్వారా ఆ న్లైన్లో శిక్షణ తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ నిర్వహించే సెంటర్‌ఫర్ ఎక్సలెన్సీ, ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేశారు. దేశ, విదేశాల్లో ని నిపుణుల సలహాల మేరకు ఆయన తన ఇంటి ఆ వరణలో హైడ్రోఫోనిక్స్ వ్యవసాయాన్ని ప్రారంభించారు. మొదటగా పాలకూర, తోటకూర, బచ్చలుకూర, మెంతికూర, తులసీ, బేసిల్ అంతర్జాతీయ మొక్కల పెంపకం మొదలుపెట్టారు. అలాగే బర్గర్లు, పిజ్జా వంటి ఆహార పదార్థాల్లో వినియోగించే లెట్యూస్ అనే ఆకు కూరల పెంపకం చేపడుతున్నారు. వీటితోపాటు టమాటా, స్ట్రాబెర్రి వంటి మొ క్కలను కూడా పెంచుతున్నారు. పోషకాహార పదార్థాలైన ధనియాలు, కందులు, పెసర్లు, మినుము లు, మెంతులు, శనగలు వంటి 8 రకాల ధాన్యాల ను పండిస్తున్నారు. మొక్కలకు తగిన మోతాదులో ఉష్ణోగ్రత అందేలా గ్రీన్షెడ్ ఏర్పాటు చేశారు. షె డ్డులో దాదాపు 1500 వందలకు పైగా మొక్కలను పెంచుతున్నట్లు శివకుమార్ తెలిపారు.
ఒకే ఫ్రేమ్‌లో చుట్టూ పైపులు బిగించి, మొక్కల పెంపకానికి ఆరిప్యూరిఫై చేసిన నీటి సరఫరా కోసం ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలు పెం చేందుకు ఏర్పాటు చేసుకున్న ఫ్రేమ్ చుట్టూ పైప్‌లై న్లు బిగించి మోటారు ద్వారా పైపులైన్లలో నీళ్లు స రఫరా చేస్తారు. ట్యాంకు ద్వారా పైపులైన్లలో నీళ్లు రీసర్క్యూలెట్ చేసేలా తయారు చేసుకోవాలి. ఆకుకూరల విత్తనాలు ఒక ట్రేలో మొదటగా నారు పెం చాలి. 20 రోజుల్లో నారు తయారుకాగానే ఒక క ప్పులో నారు పెట్టాలి. మొక్క పెరిగిన వెంటనే కిందపడకుండా మట్టితో తయారుచేసిన క్లేబాల్స్ పెట్టాలి. మొక్క తొందరగా పెరిగేందుకు కోకోఫిట్, పెరలైట్ వేయాలి. ఆ తర్వాత పైపులైన్లో నీళ్లు రీసర్క్యూలె ట్ చేస్తుండాలి. వారంలో మొక్కలు చేతికొస్తాయి.
ఆధునిక పద్ధతిలో చేపడుతున్న హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం మిద్దెతోటల పెంపకానికి సులభమైన పద్ధతి. తక్కువ స్థలంలో మట్టి లేకుండా తక్కువ నీటితో హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం చేసుకోవచ్చు. ఎలాంటి పెస్టిసైడ్స్ వినియోగించకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవచ్చు. భూమి మీద కంటే హైడ్రోఫోనిక్స్ వ్యవసాయంతో మొక్కలు తొందరగా పెరుగుతాయి. ఇంటి ఆవరణలోనే ఓ కుటుంబానికి అవసరమైన కూరగాయాలు పెంచుకోవచ్చు. ఇందుకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ పద్ధతిని ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే దాదాపు 15 ఏండ్ల వరకు ఉంటుంది. ఆకుకూరలతోపాటు న్యూట్రీషియన్ ఆహారాన్ని పండించుకోవచ్చు. ఎనిమిది రకాల పోషకాహార పదార్థాలను పండిస్తున్నాను. ఈ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను.
– బాద్మి శివకుమార్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్