వనపర్తి, నవంబర్ 20 : మెడిసిన్ విద్యనభ్యసించి డాక్టరైన తర్వాత పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీట్లో 516 మార్కులు, రాష్ట్ర స్థాయిలో 30వ ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ముడావత్ దివ్యశ్రీని మంత్రి అభినందించారు.
శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సొంతూరికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కంచె రాఘవేంద్ర, నాయకులు పాల్గొన్నారు.