అచ్చంపేట, నవంబర్ 20 : ప్రజాస్వామ్యయుతం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పన్నిన కుట్రలను భగ్నం చేసి ప్రజల ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిచెప్పానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. ప్రాణాలకు ముప్పు వస్తుందని తెలిసినా భా రత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు పూనుకున్నానన్నారు. బీజేపీ పన్నాగాన్ని భగ్నం చేసిన తర్వాత.. ని యోజకవర్గానికి మొదటిసారి వచ్చిన గువ్వల దంపతులకు టీ(బీ)ఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికా రు. గజమాలతో సత్కారం, బైక్‌ర్యాలీ, నృత్యాలతో జేపీ నగర్ నుంచి అచ్చంపేటకు వరకు నీరాజనం పలికారు. అచ్చంపేట పట్టణం గులాబీమయంగా మారింది.
అ చ్చంపేట ప్రభుత్వ దవాఖాన నుంచి అంబేద్కర్ చౌర స్తా వరకు పూలబాటపై నడిపించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా విప్ గువ్వ ల మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దేశంలోని 8 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి వారు గద్దెనెక్కారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కూడా అలా చేయాలని చూసినా టీఆర్ఎస్ కర్రుకాల్చి వాతపెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని కా బట్టే ప్రాణాన్ని లెక్కచేయకుండా కమలం పార్టీ పన్నిన కుట్రను తిప్పికొట్టామని అన్నారు. కేసీఆర్ వదిలిన బాణమని తను అని, ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు.
కొందరు తనను చంపుతామని రకరకాలుగా బె దిరిస్తున్నారని, అయినా వాటిని లెక్కచేయనన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు మా ట్లాడలేకపోతున్నానన్నారు. కొందరు రాజకీయంగా ఎ దుర్కొనే శక్తి లేక వాల్‌పోస్టర్లు అతికించారని, అలాంటి చిల్లరచేష్టలను పట్టించుకోనన్నారు. ఓడిపోతామనే భ యంతో దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు, విమర్శలు చేసినా ప్రాజెక్టు ని ర్మాణ కాలువల్లో కొట్టుకుపోతారన్నారు. అచ్చంపేట ప్రాంతంలో 60వేల ఎకరాలకు సాగునీరు వస్తుందని, మరో లక్ష ఎకరాలకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు.
ఉమామహేశ్వరం, చెన్నకేశవస్వామి రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి అచ్చంపేట ని యోజకవర్గంలోని ప్రతి రైతు కళ్లల్లో ఆనందం నింపుతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిచి ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశారు. ఢిల్లీ పీఠంపై బాణం ఎ క్కుపెట్టినట్లు చెంచుల విల్లంబును చేతపట్టి ప్రకటించా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమల, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, పీఏసీసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.