మిడ్జిల్, నవంబర్ 20 : అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన గ్యార్మీ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మండలంలోని కొత్తపల్లికి చెందిన రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు మల్లేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదివారం కొత్తపల్లికి వెళ్లి మల్లేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభు త్వం, పార్టీపరంగా అన్నివిధాలా అండగా ఉంటామని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు బాల్రెడ్డి, సుదర్శన్, శివప్రసాద్, భీంరాజ్, ఆంజనేయులు, రమేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.