నవాబ్‌పేట, నవంబర్ 16 : రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, నవాబ్‌పేట జెడ్పీటీసీ ముత్యాల రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పోమాలలో బుధవారం సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిచి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నదన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం, ఉచితంగా విద్యుత్ అందించడంతోపాటు సకాలంలో ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నదని తెలిపారు. అలాగే ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొంటున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, సర్పంచులు గోపాల్‌గౌడ్, కృష్ణయ్య, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, పీఏసీసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, ఏఈవో శశిత, రాములు, మల్లేశ్, జగన్మోహన్గౌడ్, నర్సింహులు, మల్లయ్యగౌడ్, నరేశ్, శేఖర్‌రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.