తెలకపల్లి, నవంబర్ 16 : ప్రజా సేవ చేయాలని జనంలోకి వెళ్లే నాయకుడిని, జనం మెచ్చిన.. జనాధరణ ఉన్న.. జనానికి మేలు చేసే నాయకుడిని విజయం వరిస్తుంది.. అటువంటి నాయకుడిని జనం తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అదేపని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చే శారు. మండలంలోని రాకొండ గ్రామంలో బుధవారం ‘గుడ్ మార్నింగ్ నాగర్‌కర్నూల్’ అనే కార్యక్రమంతో ఇంటింటికీ వెళ్లారు. ప్రభుత్వ పథకా లు అందుకున్న వారితో మాట్లాడారు. ఆసరా పింఛన్లు ఎంతమందికి అందుతున్నాయో అడి గి తెలుసుకున్నారు. అర్హత కలిగిన వారికి రైతుబంధు సాయం అందజేస్తామన్నారు. గూడు లేని పేదలకు డబుల్బెడ్రూం అందజేస్తామన్నారు. గ్రామంలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. అర్హత ఉన్నా ప్రభుత్వ పథకా లు అందని వారి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు, ఎంపీపీ మధు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, విం డో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు మా ధవరెడ్డి, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.