గద్వాల, నవంబర్ 14 : పత్తి రైతులకు మద్దతు ధ ర కల్పించి.. దళారుల చేతుల్లో మోసపోకూడదనే ల క్ష్యంతో ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి మార్కెట్ ఏ ర్పాటు చేసింది. కొనుగోలు చేసిన పత్తిని నిల్వ ఉం చేందుకు గోదాంలు కూడా నిర్మించింది. అయినా, పత్తి మార్కెట్లో లావాదేవీలు కొనసాగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో, గ్రామాల్లోకి వస్తున్న దళారుల చేతుల్లో రైతులు దగాకు గురవుతున్నారు. అంతేకాకుండా రాయిచూర్, ఆంధ్ర ప్రాంతాల్లోని మార్కెట్లకు పత్తిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
పత్తి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీ ఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశా రు. అయితే, ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చినా కూడా ఇంకా కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయలేదని రై తులు వాపోతున్నారు. పత్తిని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుండడంతో మార్కెట్ యార్డ్ ఆదాయానికి గండి పడుతున్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతులు గతేడాది 1,81,948 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈ ఏడాది వానకాలంలో 1,90,400 ఎకరాల్లో పం ట వేశారు. సుమారు 20 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు నాసిరకం విత్తనాల వల్ల రైతుకు అనుకున్న స్థాయిలో పంట చేతికి రాలేదు. కాస్తోకూస్తో వచ్చిన పత్తిని తీసి అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కొనుగోలు కేం ద్రాలు ఇంకా ప్రారంభించకపోవడంతో రై తులు పత్తిని దళారులకు విక్రయిస్తున్నా రు.
ఎక్కువ దిగుబడి వచ్చిన రైతు లు రాయిచూర్, ఎమ్మిగనూర్ మా ర్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. తక్కువ పంట వచ్చిన రైతులు అక్కడికి వెళ్లేందుకు రవాణా చార్జీలు భరించలేక దళారుల దగాకు గురవుతున్నారు. వాస్తవంగా పత్తి మా ర్కెట్ ఉన్న ప్రాంతాల్లో బయట వ్యక్తులకు పత్తిని విక్రయించొద్దు. అలా చేస్తే మార్కెట్ ఆదాయానికి గండి పడుతుంది. కానీ, మార్కెటింగ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే దళారులు అనుమతి లేకుండా పత్తి క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. మార్కెట్ అధికారులు పత్తిని కొనుగోలు చే సేందుకు ట్రేడర్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉ న్నా.. పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలం గా ఉన్నాయి. జిల్లాలో అన్ని పంటల కంటే.. ఈ సారి రైతులు పత్తిని ఎక్కువగా సాగు చేశారు. కొనుగోళ్లు జరగకపోవడంతో రూ.కోట్ల ప్రభుత్వ ధనం వృథా అవుతున్నది.
జిల్లాలో త్వరలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. రైతులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో పత్తి కొనుగోలు చేయాలని ట్రేడర్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేశాం. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే కొనుగోళ్లు నిర్వహించలేకపోతున్నాం. మరోసారి ట్రేడర్స్‌తో మాట్లాడి ఇక్కడే పత్తి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– పుష్పమ్మ, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారిణి, జోగుళాంబ గద్వాల
రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలో పత్తి మార్కెట్ ఏర్పాటు చేసింది. అందులో ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. పత్తి మార్కెట్ ఉన్నా తమకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ కొనుగోళ్లు జరగకపోవడంతో పత్తిని రాయిచూర్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దీంతో రవాణాచార్జీలు, ఇతర ఖర్చులు సుమారు రూ.2 వేల వరకు అవుతున్నాయి. పత్తి మార్కెట్ ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలి.
– చిన్న సోమన్న, రైతు, ఈడిగోనిపల్లి
పత్తి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుంది. మార్కెట్‌కూ ఆదాయం వస్తుంది. సీజన్ ప్రారంభం కాగానే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి. కానీ అధికారులు తమ గురించి పట్టించుకోవడం లేదు. దీం తో పత్తిని గ్రామాల్లో లేదా మండల కేంద్రాల్లో దళారులు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకువెళ్లి అమ్ముకోవాల్సి వస్తుంది. అధికారులు స్పం దించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి.
– రామకృష్ణ, రైతు, సంకాపురం