అవసరమైన సమాచారం క్షణాల్లో అందుబాటులో ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గ్రంథాలయాలను హైదరాబాద్ తరహాలో ఏర్పాటు చేసుకుందామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాన గ్రంథాలయంలో నిర్వహించిన 55వ వారోత్సవాల కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన 500 మందికిపైగా కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 14 : అత్యాధునిక టెక్నాలజీతో గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుందామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలో నిర్వహించిన 55వ వారోత్సవాలకు మంత్రి హాజరై మాట్లాడారు. లైబ్రరీలను సీఎం కేసీఆర్ దేవాలయాలుగా మార్చారని, హైదరాబాద్‌లోని చిక్కడిపల్లి గ్రంథాలయం తరహాలో అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాలు మంచి వేదికలు కావాలన్నారు. నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా కోచింగ్ అందించేందుకు సిబ్బంది చిక్కడిపల్లి గ్రంథాలయాన్ని సందర్శించాలని తెలిపారు. అక్కడి కంటే మంచి సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుందామన్నారు. లైబ్రరీలో పెద్ద హాల్ నిర్మించి అత్యాధునిక డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మిస్తామని, జిల్లాలో నూతనంగా ఆరు గ్రంథాలయల భవనాలు నిర్మించామని, రూ.3 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, కౌన్సిలర్ తిరుమల రోజావెంకటేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ నుంచి సిరిగిరి శ్రీనివాస్, సిరిగిరి భీమయ్య, సిరిగిరి వెంకటేశ్, కాంగ్రెస్ నుంచి కొమ్మూ రు వెంకటేశ్, రాజు, ప్రవీణ్, సుబ్బారావు, అప్పారావుతో సహ 500మంది టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకూ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న బుడగజంగాలు స్వ యంకృషితో ఎదుగుతుండడం సంతోషంగా ఉందన్నా రు. బుడగజంగాల సామాజికవర్గానికి కమ్యూనిటీహాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ప్రధానకార్యదర్శి వినోద్, కౌన్సిలర్లు జాజిమొగ్గ నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, మోసిన్, మునీర్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 14: ప్రతి వార్డులో సమస్యలు పరిష్కరిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం 4వ వార్డు ఎదిర రెవె న్యూ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో ఉ న్న అయ్యప్పకాలనీ, తిరుమలకాలనీ, బృందావన్కాల నీలో రూ.21లక్షల 90వేల వ్యయంతో చేపట్టనున్న పైప్‌లైన్ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తాగునీటి కోసం ప్రజలు 15రోజులు వేచి చూసేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు అందించి సమస్య పరిష్కరించామని తెలిపారు. కొత్తకాలనీలో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ యాదమ్మ, నాయకులు నర్సింహులు, హన్మంతు. రాములు, నవకాంత్రెడ్డి, కాశన్న, కృష్ణ, ఎంఈ సుబ్రహ్మణ్య, ఏఈ హరికృష్ణ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 14: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీనియర్ సిటిజన్స్‌కు గుర్తింపు వచ్చిందని, మహబూబ్‌నగర్ జిల్లాను కాపాడుకోవడంలో సీనియర్ సిటిజన్స్ ముందున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులను అన్నివిధాలుగా ఆదుకుంటామని, మీ సహకారం అవసరమన్నారు. ఉద్యోగులు తెలంగాణ ఏర్పాటుకు సహకరించారని, ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు మాతోపాటు ముందుండి నడిచారని, వారి సేవలు మరవలేమన్నారు. సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశానని, కోర్టు కేసు వల్ల ఆగిపోయిందన్నారు. కేసు తొలగిన వెంటనే మరిన్ని నిధులతో మోడల్ భవనంగా నిర్మిస్తామన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజసింహుడు, ఉపాధ్యక్షుడు నారాయణ, బీహెచ్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ కార్యధర్శి కొండయ్య, గఫార్, డీసీసీబీ కార్యదర్శులు అబ్దుల్ఖరీమ్, జగదీశ్వర్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల విశ్రాంత ఉద్యోగులు, ఆండ్రూస్ ఎలియాస్, డెయిరీ డెవలప్మెంట్ కార్యదర్శులు కృష్ణయ్య, అనంతరెడ్డి, ఈపీఎస్ పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు.