అమెరికాలో స్థిరపడిన ఇద్దరు మిత్రుల ఆలోచన…కలెక్టర్ హరిచందన ఆచరణతో ‘ఆరోగ్య వాహిని’ పురుడుపోసుకున్నది. పేదలకు టెలీమెడిసిన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నారాయణపేట జిల్లాలో తొలి విడుతలో పది గ్రామాల్లో వైద్య సేవలుప్రారంభించారు. 9వేల మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. హై డెఫినేషన్ స్టెతస్కోప్‌తో టెలీ వర్చువల్ ద్వారా ఆన్లైన్లో హైదరాబాద్‌తో పాటు విదేశాల నుంచి సైతం వైద్యులు రోగికి అవసరమైన మందులు, చికిత్సను అందజేస్తున్నారు
హైదరాబాద్‌కు చెందిన సురేశ్ చల్లా, సాయిప్రతాప్ స్నేహితు లు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రతిభ చాటి అమెరికాలో స్థిరపడ్డారు. ప్ర జలకు ఏదైనా మేలు చేయాలన్న సంకల్పంతో వారు టెలీమెడిసిన్ విధానాన్ని ఎంచుకున్నారు. చదివింది ఒక రంగం.. ఎం చుకున్నది మరో రంగం.. గ్రామీణ ప్రాం తాల్లోని వారికి ఉచితంగా వైద్య సేవ లు అందించాలని భావించారు. ఈపిక్స్ అనే స్వచ్ఛంద సంస్థలో ట్రస్టీ సభ్యులుగా ఉన్న సురేశ్, సాయిప్రతాప్ దవా-ఖాన అనే ప్రా జెక్టుకు రూపకల్పన చేశారు. సురేశ్ ఫౌండర్ కం చైర్మన్‌గా, సాయిప్రతాప్ ఫౌం డర్ కం సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. దవా-ఖాన అనే ప్రాజెక్ట్ ద్వారా ఆరోగ్య వాహిని కా ర్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును ఎక్కడ స్థాపిస్తే విజయవంతం అవుతుందని అనుకుంటున్న సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్వీపీ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ‘అంకురం’ కార్యక్రమానికి సాయిప్రతాప్ వచ్చారు. కార్యక్రమానికి వచ్చిన అప్పటి కలెక్టర్ దాసరి హరిచందనతో సా యిప్రతాప్ మాట్లాడుతూ టెలీ మెడిసిన్ విధానాన్ని వివరించారు. ఆయన కాన్సెప్ట్ నచ్చడంతో నారాయణపేట జిల్లాలో ప్రారంభిస్తే.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని సూచించింది. సాయిప్రతాప్, సురేశ్చల్లా చర్చించి.. నారాయణపేటలో ఆరోగ్యవాహిని ప్రయాణం మొదలుపెట్టారు. బ్లడ్డ్రైవ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో రక్త నమునా పరీక్షలు నిర్వహించేందుకు వేణిరావు సంస్థ అందించిన రెండు బస్సులను కలెక్టర్ హరిచందన దవా-ఖాన ప్రాజెక్టుకు కేటాయించారు. అయితే, హైకోర్టు న్యాయమూర్తి జ స్టిస్ జ్ఞాపకార్థం సురేశ్చల్లా.., రైల్వే వైద్యరంగంలో సేవలందించిన తన తండ్రి ప్రతాప్ నర్సింగ్‌రావు, త ల్లి సబితాబాయిల జ్ఞాపకార్థం సాయిప్రతాప్.. బస్సు ల రీ డిజైనింగ్‌కు అయ్యే ఖర్చును భరించారు. ప్రతి బస్సులో రెండు బెడ్లు, డాక్టర్ డెస్క్, ల్యాబ్, మెడిసి న్ నిల్వకోసం రీఫ్రిజిరేటర్, టెలీమెడిసిన్ ప్రొజెక్టర్, సీసీ కెమెరాలు, జీపీఆర్ఎస్ సదుపాయాలు కల్పించారు. ఆరోగ్యవాహిని కార్యక్రమానికి మొదటగా ఒక బస్సు చేసి.. విజయవంతమైతే రెండో మ రో పది గ్రామాలకు ఇంకో బస్సు ద్వారా వైద్య సేవ లు అందించాలని నిర్ణయించారు. మొదటి విడుతలో నారాయణపేట మండలంలోని పేరపళ్ల, అప్పక్‌పల్లి, సింగారం, భీమండి కాలనీ, శ్యాసన్‌పల్లి, ఎక్లాస్పూర్, జాజాపూర్, శేర్నపల్లి, బైరంకొండ, జలాల్పూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం 4 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరో గ్రామం చొప్పున.. వారంలో ఐదురోజులకు గానూ అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బస్సుల్లోనే రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తున్నారు. సాధారణ రోగులకు ఆరోగ్య వాహినిలో ఉండే వైద్యులు, గుండె సంబంధిత రోగులకు టెలీ మెడిసిన్ ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఇందుకుగానూ ఎనిమిది ఏడుగురు సిబ్బందిని నియమించారు. ఇందులో ఐదుగురు వైద్యులు, ఒక ప్రాజెక్ట్ సూపర్వైజర్, ఒక నర్స్, ఒక డ్రైవర్ ఉన్నారు. వీరితో పాటు టెలీమెడిసన్ ద్వారా వైద్య సేవలందించేందుకు మరో 50 మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నారు. వీరి వేతనాలకు అయ్యే మొత్తంతోపాటు బస్సు మెయింటనెన్స్, డీజిల్‌ను ఈపిక్స్ సంస్థ నిర్వాహకులు భరిస్తున్నారు.
‘మన ఆరోగ్యం.. మన చేతిలో’ అనే లక్ష్యంతో గ్రామీ ణ ప్రజలకు టెలీ మెడిసిన్ ద్వారా ప్రపంచంలో నైపుణ్యత ఉన్న వారితో ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అమెరికాలో స్థిరపడిన ఇద్దరు మిత్రులు చేపట్టిన ఆరోగ్య వాహిని కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. గతంలో పనిచేసిన కలెక్టర్ దాసరి హరిచందన సహకారంతో నారాయణపేట జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిర్వాహకులకు రెండు బస్సులను సమకూర్చారు. ఐదు నెలల కిందట ప్రారంభమైన ఆరోగ్యవాహిని ద్వారా ప ది గ్రామాల్లో 400 సార్లు పర్యటించి 9 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అంతేకాకుండా హై డెఫినేషన్ స్టెతస్కోప్‌తో ఈసీజీ, గుండె చప్పుడును ఐప్యాడ్‌లో నమోదు చేసి, వర్చ్యువ ల్ విధానంలో హైదరాబాద్‌లోని గుండె సంబంధిత వైద్యులకు తె లియజేసి.. వారి నుంచి వైద్య సలహాలు తీసుకుంటున్నారు. గ్రామాలకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఆరోగ్యవాహిని సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.
– నారాయణపేట, నవంబర్ 14
ఈ ఏడాది మేలో ఆరోగ్య వాహిని ప్రాజెక్టును ప్రారంభించారు. ఐదు నెలల్లోనే ప్రతి రోజూ సరాసరి వంద మంది చొప్పున 9 వేల మందికి వైద్యసేవలందించారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన ప ది గ్రామాల్లో 400 సార్లు సందర్శించారు. ఆరోగ్య వాహిని కింద బీ పీ, షుగర్ వంటి ల్యాబ్ పరీక్షలు చేపడుతున్నారు. రానున్న రోజుల్లో గుండె, ఆర్థో సేవలను అందించనున్నారు. ప్రతి గ్రామంలో ఆశవర్క ర్ల మాదిరిగా ఆరోగ్య వాహిని తరపున ఆరోగ్య సఖిలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య వాహిని వాహనం వారం విడిచి వారం గ్రామాలను సందర్శిస్తున్నది. ఒక్కసారి గ్రామానికి వాహనం రావడానికి వారం రోజులు పట్టనున్న నేపథ్యంలో ఆ రోగ్య సఖి రోగుల వద్దకు వెళ్లి సలహా అందించనున్నారు. దీనివల్ల రోగికి మరింత మెరుగైన వైద్య సేవలందే వీలు ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా, హై డెఫినేషన్ స్టెతస్కోప్‌ను రోగి చా తిపై ఉంచి శ్వాస పనితీరు, గుండె చప్పుడు, ఈసీజీని ఐప్యాడ్‌లో న మోదు చేస్తున్నారు. వీటిని టెలీ వర్చ్యువల్ ద్వారా హైదరాబాద్‌తోపాటు విదేశాల నుంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వారు అక్కడి నుంచే రోగికి అవసరమైన మందులు, చికిత్సలను తెలియజేస్తున్నా రు. గుండె సంబంధిత రోగులు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా తమ గ్రామం నుంచే అంతర్జాతీయ స్థాయి వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకునే వీలు ఏర్పడుతున్నది. ఆరోగ్యవాహి ని కార్యక్రమానికి గతంలో కలెక్టర్‌గా పనిచేసిన హరిచందన పూర్తిస్థా యి సహాయ సహకారాలందించగా.. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కోయ శ్రీహర్ష సైతం అదేతీరును కొనసాగిస్తున్నారు. ఆరోగ్యవాహిని పనితీరును స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా.. ప్రజలు తామంతట తాము నిలబడాలి. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం పెద్ద పెద్ద నగరాలకు వెళ్లకుండా.. ఇండ్ల వద్దే అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలందించాలని దవా-ఖాన ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మన చేతిలో-మన ఆరోగ్యం అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. తాము చేపట్టిన టెలీమెడిసిన్ వైద్య సేవల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. అప్పుడే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మొదటి విడుతలో చేపట్టిన గ్రామాల్లో ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి.
– సురేశ్ చల్లా, చైర్మన్, దవా-ఖాన ప్రాజెక్ట్
మా నాన్న ప్రతాప్ నర్సింగ్‌రావు రైల్వేలో వైద్యసేవలందిస్తూనే సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. దీంతో మా నాన్నపై ప్రజలకు అభిమానం ఉండేది. ఆయన బిడ్డగా నన్ను కూడా గౌరవిస్తున్నారు. డబ్బులు చాలా మందితో ఉంటాయి. కానీ సేవ చేసే ఆలోచన కొందరికే ఉంటుంది. మా నాన్న బాటలో నేను పయనించాలని భావించాను. నా స్నేహితుడు సురేశ్చల్లాతో కలిసి దవా-ఖాన అనే నాన్ ప్రాఫిట్ సేవా సంస్థను స్థాపించాం. ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపట్టాం. గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో ఆరోగ్య వాహిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రానున్న రోజుల్లో ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నాం.
– సాయిప్రతాప్, సీఈవో, దవా-ఖాన ప్రాజెక్ట్
మా గ్రామ ప్రజలకు ఆరోగ్య వాహిని ద్వారా ఉచిత వైద్య సేవలందుతున్నాయి. ఆరోగ్య వాహిని వైద్య బృం దం రాక ముందు.. నారాయణపేటకు వెళ్లి పరీక్షలు చే యించుకునేవాళ్లం. వారంలో ఒక రోజు తమ ఊరికే వ చ్చి వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా మందులను అందిస్తున్నారు. దీంతో వైద్యం చేయించుకునేందు కు ఆర్థిక స్థోమత లేని ఎంతో మందికి మేలు జరుగుతున్నది. మాకు తెలిసిన వాళ్లకు కూడా వైద్యం చేయిస్తున్నాం. ఆరోగ్యవాహిని సేవలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నా.
– కవిత, సర్పంచ్, శ్యాసన్‌పల్లి, నారాయణపేట