స్టాక్ పాయింట్లు, రైస్ మిల్లుల వద్ద బియ్యం దందా జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని చౌకధర దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యం తూకాల్లో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. 50 కిలోల బస్తాలో 43 కిలోల బియ్యం తూకం మాత్రమే వస్తున్నది. ఒక్క బ్యాగ్‌లో 6 నుంచి 7 కిలోల తరుగు వస్తుంది. ఇన్చార్జిల మాయాజాలంతో ప్రతి నెలా రూ.లక్షలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎస్వోలు తనిఖీలు మరిచారు. వనపర్తి, పాలమూరులో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నది. రూపాయికి కిలో బియ్యం కావడంతో డీలర్లు నోరుమెదపడం లేదు. దీంతో ప్రతినెలా వందల క్వింటాళ్లు పక్కదారి పడుతున్నవి. స్టాక్‌పాయింట్ల నుంచే నేరుగా లోడ్లు తరలుతున్నాయి.
మహబూబ్ నగర్, నవంబ ర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం సబ్సిడీపై రేషన్ బి య్యం అందిస్తున్నది. ఇది అక్రమార్కుల పాలిట వరంగా మా రింది. ఉమ్మడి జిల్లాలోని స్టాక్ పా యింట్లు బియ్యం దందాకు కేరాఫ్‌గా ని లుస్తున్నాయి. రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యం తూకంలో భారీ మోసం చోటు చేసుకుంటున్నది. దీంతో ప్రతినెలా వందల క్వింటాళ్ల బియ్యం పక్కదారి పడుతున్నది. స్టాక్‌పాయింట్ల ద్వా రా బియ్యాన్ని నేరుగా డీలర్లకు చేరవేస్తున్నారు. ఇటీవ ల వనపర్తి జిల్లాలో రేషన్ బియ్యం భారీగా పట్టుబడిం ది. ఇతర జిల్లాలో దొరుకుతున్న బియ్యం కూడా వనపర్తి నుంచే వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూ ల్ జిల్లాల్లో కూడా ఇదే దందా కొనసాగుతుందని ప్ర చారం జరుగుతున్నది. ప్రతినెలా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు స్టాక్‌పాయింట్ల దిక్కు కూడా చూ డడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి తూకంలో మోసం జరిగినా.. డీలర్లకు మాత్రం సరఫరా చేయాల్సిన మొత్తం బియ్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గోదాంల నుంచి స్టాక్ పాయింట్లకు వ చ్చిన సంచుల్లోనే 6 నుంచి 7 కిలోల బియ్యం తక్కువ వస్తుందని డీలర్లు ఆరోపిస్తున్నారు.
పేదోడి బియ్యం బుక్కుడే..
రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్న ది. ఉమ్మడి జిల్లాలోని స్టేజ్-1, స్టేజ్-2 స్టాక్ పాయింట్లలోనే దందాకు తెరలేపారు. 50 కేజీల బస్తాలో 43 కేజీల తూకం మాత్ర మే ఉంటున్నది. కోత పెట్టిన బియ్యాన్నంతా స్టాక్ పాయింట్ ఇన్చార్జీలు అమ్ముకుటున్నారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఎక్కడ బియ్యం పట్టుబడినా.. అధికారులు లోతుగా విచారణ జరపకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. ప్రభుత్వం పే దలకు రూ.1కి ఇస్తున్న బియ్యం.. బహిరంగ మార్కె ట్లో రూ.20 నుంచి రూ.25 వరకు ఉంటుండడంతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. కాగా, ఉ మ్మడి జిల్లాల్లోని ఎఫ్‌సీఐ గోదాంల నుంచి స్టాక్పాయింట్లకు రేషన్ బియ్యం వస్తున్నది. స్టేజ్-1, స్టేజ్-2 స్టాక్ పాయింట్ల నుంచి ఆయా జిల్లాలోని రేషన్ షా పులకు బియ్యం సరఫరా అవుతున్నది. అయితే, రేషన్ బియ్యం సరఫరాలో పౌర సరఫరాల అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల డీలర్లు పెద్ద ఎత్తున నష్టపోతున్నా రు. గతంలో కొంతమంది రేషన్ డీలర్లు లారీలను వే యింగ్ మిషన్లలో తూకం వేస్తే బియ్యం తక్కువ వ చ్చింది. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదని డీలర్లు చెబుతున్నారు. మండలస్థాయిలోని స్టాక్ పా యింట్ల వద్ద అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవినీ తి విషయంలో అందరి చేతులు తడుస్తుండడంతో డీ ఎంలు, డీఎస్వోలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతున్నది. ఎంఎల్ఎస్ పాయింట్ల కు చేరే బియ్యం బస్తాలో 50 కేజీలకు బదులు 43.50 కిలోలే ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు.
రేషన్ దుకాణాల్లోనూ అక్రమాలే..
ఉమ్మడి జిల్లాలోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. చాలాచోట్ల ప్రజలు గ్రామా ల్లో ఉండడం లేదు. అలాంటి చోట వారికి బియ్యం పంపిణీ చేసినట్లు సృష్టించి డీలర్లు అధికారులతో చేతు లు కలిపి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో స్టా క్ పాయింట్ల నుంచి బియ్యం తక్కువ వస్తున్నా డీలర్లు మౌనం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, స్టాక్ పాయింట్లలో మిగిలిన బియ్యంలో సిబ్బంది, అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా నెలకు రూ.లక్షల్లో వెనుకేసుకుంటున్నారు. బియ్యాన్ని రేషన్ దుకాణాలకు బస్తాలను లోడ్ చేసే సమయంలో.. పథకం ప్రకారం తూకంలో మోసం చేసిన రైస్‌ను బస్తాల్లో నిల్వచేసి పక్కన పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.