గిరిజనుల్లో సంతోషం ఉప్పొంగింది. 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 130తోపాటు రోస్టర్ పాయింట్స్ విధానాన్ని విడుదల చేసింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిఠాయిలు తినిపించుకొని పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపింది.. సీఎం కేసీఆర్ అని కృతజ్ఞతలు తెలిపారు.
– మహబూబ్‌నగర్, నవంబర్ 11
మహబూబ్‌నగర్, నవంబర్ 11 : స్వరాష్ట్రం లో గిరిజనులకు భరోసా కల్పిస్తూ.. ఆదర్శప్రాయంగా జీవించేలా టీ(బీ)ఆర్ఎస్ సర్కార్ చర్య లు తీసుకుంటున్నది. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడంతో ప్రత్యేక శోభ సంతరించుకున్నది. ప్రతి తండా నుంచి మండలకేంద్రానికి కనిక్టివిటీ ఉండేలా బీటీ రోడ్లు నిర్మించా రు. ఇలా ప్రతి విషయంలోనూ గిరిజనులకు సీ ఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. కాగా, రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచి.. రోస్టర్ పాయింట్స్ అమలు చేసేందుకు జీవో నం.130 విడుదల చేశారు. గిరిజనులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 8 ఎస్(డబ్ల్యూ), 15 ఎస్టీ, 25 ఎస్టీ, 33 డబ్ల్యూ, 42 ఎస్టీ, 58 ఎస్టీ, 67 ఎస్టీ, 75 ఎస్టీ డబ్ల్యూ, 83 ఎస్టీ, 92 ఎస్టీ రోస్టర్ పా యింట్లను విడుదల చేసింది. దీంతో గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 11 : కొ న్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా గిరిజనుల ను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదని, నేడు రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని గిరిజన, ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం ధన్యవాద కార్యక్రమం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్, గిరిజన సేవా సంఘం సహాయ అధ్యక్షుడు ప్రతాప్నాయ క్ మాట్లాడుతూ రిజర్వేషన్లు పెంచి.. రోస్టర్ పా యింట్స్ అమలు చేయడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పటాకు లు కాల్చడంతోపాటు మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు రమేశ్, ఎస్ఎల్ఎన్ఎస్ దేవస్థాన మెంబర్ చందర్‌నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పెంట్యానాయక్, మాజీ సర్పంచ్ కిషన్పవా ర్, ఆయా సంఘాల నాయకులు చిన్యానాయక్, కిషన్సంగ్, రామ్‌చందర్, ప్రవీణ్, రుక్మిణిబాయి తదితరులు పాల్గొన్నారు.