జడ్చర్ల, నవంబర్ 11 : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి రైతులకు అండగా నిలిచిందని జ డ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. శుక్రవారం జడ్చర్ల పత్తి మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. కర్షకులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చె ప్పారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమంటే ఇబ్బందులు పాలు చేసిందని, అయినా సీఎం కేసీఆర్ ముందుకొచ్చి ప్రతి గిం జనూ కొనుగోలు చేశారన్నారు. తెలంగాణ రైతులపై కేంద్రంలోని మోదీ సర్కా ర్ వివక్ష చూపుతుందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయమంటే చేయలేని కేంద్రం ఎమ్మెల్యేలను మాత్రం కొ నుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలను ప్రజలు ఖం డించాలని పిలుపునిచ్చారు. దేశంలో సుభిక్ష పాలేన అందించేందుకే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, రాష్ట్ర సంగీ త, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు సుదర్శన్‌గౌడ్, మల్లేశ్, వైస్ చైర్మన్లు హనుమంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్ దశరథరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు లక్ష్మయ్య, మురళి, మార్కెట్ డైరెక్టర్లు శ్రీ కాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుభాష్, పవ న్, శ్రీను, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, గంగాపూర్ సర్పంచ్ చంద్రకళా గోపాల్, పీఏసీసీఎస్ సీఈవో యాదిగిరి, సురేశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ముడా డైరెక్టర్ ప్రీతం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.