మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 11 : ఉదయం 6 గంటల స మయం.. స్థలం మహబూబ్‌నగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మై దానం.. లాఠీలు, తుపాకులు ఉండాల్సిన పోలీసుల చేతుల్లో పలుగు, పా రలు ఒదిగిపోయాయి. వారంతా ఏమి చేశారంటే.. పోలీస్ కవాతుకు ఎం తో సౌందర్యాన్ని, గంభీరతను అందించే పోర్ట్వాల్ నిర్మాణానికి పోలీసు లు కలిసికట్టుగా కదిలారు. మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అ నుకున్నదే తడువుగా స్వయంగా పలుగు, పార చేతబట్టి సిబ్బందికీ అందించారు. పోర్ట్వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
జిల్లా అధికారులు, పో లీస్ సిబ్బంది ఇందులో భాగస్వాములయ్యారు. పోలీస్ శాఖ శ్రమైక జీవనానికి తార్కాణంగా నిలిచిందని సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. 158 అడుగుల పొడవు.. రెండడుగుల లోతు, వెడల్పుతో పునాది.. ఒకటిన్నర గంటల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. 9 నెలల పోలీస్ శిక్షణా కా లంలో శారీరక పటుత్వంతో పాటు వృత్తిపరమైన జీవితానికి అవసరమైన వివిధ నైపుణ్యాలను ఓపికతో నేర్చుకున్నారు. పోలీస్ వృత్తిలో భాగమని గుర్తు చేశారు. పనుల్లో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీలు రమణారెడ్డి, ఆదినారాయణ, మహేశ్, శ్రీనివాసులు, రాజు, రాజేశ్వర్, సురేశ్, శ్రీనివా స్, అప్పలనాయుడు, రవికుమార్, స్వామి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.