నవాబ్‌పేట, నవంబర్ 10 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మరికల్లో గురువారం రూ.20లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.20లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రారంభించిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మా రిపోయాయన్నారు.
హరితహారం, పల్లెప్రగతి పనులు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేసి గ్రామాలను మ రింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, సర్పంచులు పాండురంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాయకులు హరికృష్ణ, నాగరాజు, చెన్నయ్య, భీమయ్య పాల్గొన్నారు.