వనపర్తి టౌన్, నవంబర్ 8 : అనుమానాస్పద స్థితిలో వృ ద్ధురాలు మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో మం గళవారం చోటు చేసుకున్నది. బ్రాహ్మణ వీధి పీర్లచావిడి స మీపంలో నివసిస్తున్న వృద్ధురాలు వరలక్ష్మి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. వరలక్ష్మి.. సోమవారం ఉదయం 10 గంటల వరకు కాలనీలో తిరిగిన ట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.
మంగళవారం వరలక్ష్మీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. వరలక్ష్మి కాళ్లను కట్టే సి, మెడను టవల్‌తో చుట్టి చంపినట్లు భావిస్తున్నామన్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్కాడ్‌తో పరిశీలించామని, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామన్నారు. అయితే, కు టుంబసభ్యుల కథనం మేరకు.. వరలక్ష్మి ఒంటరిగా జీవిస్తుందని, ఇటీవల ఆమెకు కొంత నగదు వచ్చిందని.. బంగారం, నగదు కోసమే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. మృ తురాలి కుమారుడు రెండేండ్ల కిందటే మరణించగా.., ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు చెప్పారు.
మంగళవారం ఉదయం 11 గంటలైనా తలుపులు తెరిచే ఉన్నాయి.. కానీ ఇంట్లో మనుషుల కలయికలు లేవని ఇంటిపక్కల వాళ్లు స మాచారం ఇవ్వడంతో కుటుంబీకులు వచ్చి చూశారు. మం చం కింద బండలపై పడిఉందని, ముక్కు రంధ్రాల నుంచి రక్తం కారినట్లు గమనించారు. మృతురాలి రెండు బంగారు గాజులు, గొలుసు, ఇంట్లోని ఆభరణాలతోపాటు నగదు దొంగిలించారని కుటుంబీకులు చెబుతున్నారు.