టేకులపల్లి, ఫిబ్రవరి 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండా, బొమ్మనపల్లితండా, బిల్లుడుతండా, లచ్యతండా, టేకులపల్లి గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేశారు. ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్ మాట్లాడుతూ.. టేకులపల్లి మండలంలో చేపట్టిన సోదాల్లో 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని భూక్యా ఉష, లావుడ్య అంకి అనే మహిళలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో సిబ్బంది వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, పార్ధసారధి పాల్గొన్నారు.