మరికల్, నవంబర్ 8 : అక్రమంగా ఇ సుక తరలిస్తున్న ట్రాక్టర్‌పై నుంచి కిందప డి యువకుడు మృతి చెందిన ఘటన జి న్నారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. జిన్నారం గ్రామానికి చెందిన ఆంజనేయు లు (23) ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, సోమవారం అర్ధరాత్రి జిన్నారం గ్రామంలోని మన్నెవాగు నుంచి నర్వకు ఇసుకను ట్రాక్టర్లో తరలిస్తుండగా.. చిత్తనూర్ సమీపం లో రోడ్డుపై నిల్వ ఉంచిన వరి కుప్పపైకి ఎక్కడంతో ఆంజనేయులు ట్రాక్టర్ కింద పడి అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యా యి. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి బాధిత కు టుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై మరికల్ ఎ స్సై అశోక్‌బాబును సంప్రదించగా.. ఎ లాంటి సమాచారం లేదన్నారు.