నాగర్‌కర్నూల్, నవంబర్ 7: కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో ఎమ్మెల్యే 4లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా వందశాతం సబ్సిడీతో చేప పిల్లలు అందజేసిన ఏకైక ప్ర భుత్వం తెలంగాణ అని, మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కులవృత్తులపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణులు, రజకులకు విద్యుత్ సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. గొల్ల కురుమలకు త్వరలోనే రెండో విడుత గొర్రెలు పంపిణీ చేపట్టేందుకు సర్కార్ సిద్ధమైందన్నారు. రాష్ట్రంలోని పేదింటి కుటుంబాల్లో ఆడబిడ్డ పెండ్లి అంటే భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే మర్రి తెలిపారు.
సోమవారం స్థానిక సాయి గార్డెన్స్‌లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆడపడుచులు గౌరవంగా ఉండాలన్నదే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సర్కారుకు ఎల్లప్పుడూ మీ దీవెనలు కావాలన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రజలకు వరంలా మారిందని ఎమ్మెల్యే మర్రి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు రూ.24 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సహాయనిధి పథకం అండగా నిలుస్తుందన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ఎవరికీ తెలియని పరిస్థితులు ఉండేదని ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, జెడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సింగిల్‌విండో చైర్మన్లు పాల్గొన్నారు.