ఊట్కూర్, నవంబర్ 7 : విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో వైద్య సేవలనందిస్తుంద ని సర్పంచుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఊట్కూర్, పులిమామిడి పీహెచ్సీ పరిధిలో 10 నుంచి 16 ఏండ్ల ్లలోపు పాఠశాల విద్యార్థులకు సోమవారం డిఫ్తీరియా వ్యాధి నివారణకు టీ డీ వ్యాక్సిన్ వేశారు. నిడుగుర్తి, పులిమామిడి గ్రామాల్లో స ర్పంచులు యశోదమ్మ, సూరయ్యగౌడ్ టీకాల పంపిణీని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాలమేరకు ఈనెల 18 వరకు టీకా పంపిణీ కొనసాగుతుందని పీహెచ్సీ వైద్యులు మల్లికార్జున్, నరేశ్‌చంద్ర తెలిపా రు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య, ఎంపీటీసీ రాఘవరెడ్డి, హెచ్ఎంలు సురేశ్, లక్ష్మారెడ్డి, సునంద, శ్రీవిద్య పాల్గొన్నారు.
నర్వ మండలంలో…
నర్వ, నవంబర్ 7 : మండలంలోని లంకాల, నర్వ, పెద్దకడుమూర్, ఉందేకోడ్, కల్వాల తదితర గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులకు సోమవారం టీడీ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రభాకర్ శెట్టి తెలిపారు. టీకాల వల్ల విద్యార్థులకు ధనుర్వాతం, గొంతు సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుందన్నారు. 10 నుంచి 16 ఏండ్ల విద్యార్థులకు ఈ టీకాలు వేశామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, నవంబర్ 7 : మండలంలోని సంతబజార్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు సోమవారం వైద్యులు టీడీ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ నివాసులు మాట్లాడుతూ చలికాలంలో వి ద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలి తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. 44 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వే శామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్వాతి, శ్రీదేవి, ఏఎన్ఎంలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ పాఠశాలలో ..
దామరగిద్ద, నవంబర్ 7 : మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సోమవారం టీడీ వ్యాక్సిన్లను ఎంపీపీ బక్క నర్సప్ప, సర్పంచ్ ఆశమ్మ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వేశారు. 10 ఏండ్ల లోపు పిల్లలకు 244 మందికి వేశామని, 11 నుంచి 16 ఏండ్ల విద్యార్థులకు 47 మందికి, బడిబయట పిల్లలు నలుగురికి వేసిన ట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో రామన్న, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జాజాపూర్ పాఠశాలలో…
నారాయణపేట రూరల్, నవంబర్ 7 : మండలంలోని జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 16 ఏండ్ల విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్ వేశారు. అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మీదేవమ్మ, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.