నారాయణపేట, నవంబర్ 7 : రైతులు ధాన్యాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని నైపుణ్య శిక్షణా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై సోమవారం రైస్ మిల్లర్లు, ఏఈవోలు, ఏవోలు, రైతు సంఘాల నాయకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందన్నారు. రైతులకు పంట పెట్టుబడిగా రైతు బంధు ఇవ్వడంతోపాటు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరించి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు. జిల్లాలో పండించిన పంట వివరాలు ఏఈవోలకు తెలుసు కాబట్టి గన్నీ బ్యాగుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులతో ధాన్యం సేకరించాక ఆ ధాన్యం రైస్ మిల్లులకు చేరవేసే వరకు పూర్తి బాధ్యత కేం ద్రాల నిర్వాహకులదే అని తెలిపారు. ధాన్యం తరలించేందుకు లారీల కాంట్రాక్టర్లు లారీలను సిద్ధంగా ఉంచాలన్నా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగో లు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని సూచించారు.
కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు ప్రా రంభం అయిన కారణంగా కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. లైన్ డిపార్టుమెంట్ అధికారులు, రైతు సంఘాలు, రైస్ మిల్లర్లు, మహిళా సంఘాల వారు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బాధ్యతతో పనిచేసి ధాన్యం కొనుగోలు చేసి న 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు నష్ట పో కుండా పంట ఎప్పుడు కోయాలి, ఎప్పుడు ఎండ బెట్టాలి, ఎఫ్‌సీఐ నిబంధనలు తదితర అంశాలపై ఏఈవోలు అవగాహన కల్పించాలన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, 17శా తం కంటే తక్కువ తేమశాతం ఉండేలా చూసుకోవాలన్నా రు. రైతులు కొ నుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే తేదీలను ఖరారు చేస్తూ టోకెన్లు అందజేయాలన్నారు.
కేంద్రాల వద్ద తేమశా తం కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు, రైతులకు తాగునీటి సౌకర్యం, ఇత ర వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, అవసరమైతే భవిష్యత్తులో కేంద్రాలను పెంచడం జరుగుతుందన్నా రు. ఎఫ్‌సీఐకి నాణ్యమైన ధాన్యం అందజేయడంతోపాటు రైతులకు మేలు చేసేలా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీసీసీబీ చైర్మన్ ని జాంపాషా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శివప్రసాద్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హాతిరాం, డీఆర్డీవో గోపాల్‌నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి, వివిధ మండలాల ఏవోలు, ఏఈవోలు, సింగిల్విం డో చైర్మన్లు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.