కొల్లాపూర్, నవంబర్ 7 : మొక్కజొన్న రైతు దశ మారుతున్నది. మార్కెట్లో మంచి డిమాండ్‌తో మద్దతు ధరకు మించి గిట్టుబాటవుతున్నది. వద్దనుకునే పంటే ముద్దపెడుతున్నది. ఈ ఏడాది ప్ర యోగాత్మకంగా చేసిన కొన్ని కొత్త వంగడాలతో మరింత ఆదాయం పొందే అవకాశం దొరికింది. వ్యాపారుల అవసరాలు పెరగడంతో ధర పెరిగి మొక్కజొన్న రైతు లాభపడుతున్నారు. కొల్లాపూర్ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.2300 పలుకుతున్నది. అయితే పొరుగు జిల్లాలకు నుంచి పౌల్ట్రీఫాం యజమానులే నేరుగా రైతుల స్వగ్రామాల్లో కల్లాల్లోనే క్వింటా ధర రూ.2500 వెచ్చించి భారీగా కొనుగోలు చేస్తున్నారు.
సాగు విస్తీర్ణం 31,978 ఎకరాలు..
నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలంలో 31, 978 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేసిన ట్లు జిల్లా వ్యవసాయాధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా 20వేల పైచిలుకు ఎకరాల్లో సాగు కాగా ఈఏడాది అదనం గా 10వేల ఎకరాల్లో సాగైంది. ఏది సాగు చేస్తే గి ట్టుబాటవుతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు మొక్కజొన్న వేశారు. గతేడాది ఇదే పంట వద్దన్న సర్కార్ ఈమారు పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం రెట్టింపైంది. పెద్దగా తెగు ళ్లూ సోకకపోవడంతో మంచి దిగుబడి వచ్చింది.
కొత్త వంగడాలతో అధిక దిగుబడులు..
మక్కదంటుకు ఒక కంకి ఉండటం సాధారణం. కొన్ని సంకర జాతి వంగడాలకు రెండేసి కనిపిస్తాయి. ఈ సీజన్లో ఓ పేరెన్నిక కంపెనీ రైతులకు కొత్త వంగడాన్ని పరిచయం చేయగా ఒక్కో మొక్కకు నాలుగైదు కంకులు వచ్చాయి. దీంతో రైతులు దిగుబడిని రెట్టింపు చేసుకునేందుకు అవకాశంగా మార్చుకున్నారు. సాధారణ రకాలు కూడా 40క్వింటాళ్లు వచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల, పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామాల్లో రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసి సత్ఫలితాలు పొందుతున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర రూ.1962..
క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1962 ఉంది. ప్రస్తుతం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.2160 నుంచి రూ.2300 వరకు ధర పలుకుతున్నది. పౌల్ట్రీఫాం యజమానులు, ఇ తర వ్యాపారులు నేరుగా రైతు కల్లాల వద్దకే వచ్చి రూ.2300 నుంచి రూ.2500 వరకు కొంటున్నా రు. గతేడాది ఇబ్బడిముబ్బడిగా మొక్కజొన్న పం ట దిగుబడులు పేరుకుపోయాయని, సర్కార్ సా గు విస్తీర్ణం తగ్గించేలా చర్యలు చేపట్టడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి రైతులకు కలిసొస్తున్నది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా అదనంగా క్వింటాల్ పైన రూ.350 నుంచి రూ.400 పైచిలుకు వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన డిమాండ్..
మొక్కజొన్న కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సంస్థ ముందుకురావాలి. గతంలో పంట కొని వాటిని వ్యాపారులకు విక్రయించే క్రమంలో నష్టాలు చవిచూసింది. ఈసారి ఎక్కడా కేంద్రాల ఊసెత్తలేదు. మొక్కజొన్న పౌల్ట్రీ దాణాకు, బిస్కెట్ల కంపెనీలకు, స్టార్చ్, గట్క, మక్క అటుకులకు కొరత ఏర్పడింది. రైతుల వద్ద ఉన్న పంటను వ్యాపారులు పోటీపడి కొంటున్నారు.
మార్కెట్ అవసరాలకు తగ్గట్లు సాగుచేయాలి
రైతులు ఒకే రకం పంట వేయకుండా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు సాగు చేస్తే గిట్టుబాటవుతుంది. మొక్కజొన్న సాగే ఇందుకు ఉదాహరణ. పంట మార్పిడి పాటిస్తూ ప్రత్యామ్నాయ సాగు చేస్తే నేల సారవంతమై దిగుబడులు పెరుగుతాయి. కొత్త వంగడాలతో ప్రయోగాలు చేస్తే ఫలితాలు రాబట్టొచ్చు.
– రవి, ఏడీఏ, కొల్లాపూర్