దేవరకద్ర, నవంబర్ 7: రైతన్నకు మద్దతుగా ప్రతి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీ పీ రమాశ్రీకాంత్యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మీపల్లి, బస్వాయిపల్లి, హజిలాపూర్, చౌదర్పల్లి, గద్దెగూడెం తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం పంటకు పెట్టుబడి నుంచి ధాన్యం కొనుగోలు చేసేవరకు అండగా ఉంటుందన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజేందర్అగర్వాల్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖదీర్, ఎంపీటీసీ హన్మంతురెడ్డి, సర్పంచులు సుజాత, బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్, తిరుపతి రెడ్డి, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, నవంబర్ 7: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ శశిరేఖ సూచించారు. సోమవారం మండలంలోని బోయిన్పల్లి, వెలుగొమ్ముల, కొత్తూర్, రాణిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యానికి కనీస మద్ద తు ధర ఏ గ్రేడ్ రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎంపీపీ కాంతమ్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయాధికారి సిద్ధ్దార్థ, సర్పంచులు నారాయణరెడ్డి, సంయుక్తరాణి, రాధికారెడ్డి, నిరంజన్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, బాలు, భద్రయ్య, బాలస్వామి, వెంకటయ్య, శ్రీనివాసులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.