మహబూబ్‌నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో పాలమూరు నేతలు ప్రముఖ పాత్ర పోషించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం వెనుక జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల కృషి ఉన్నది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లతోపాటు ప్రజాప్రతినిధులు గల్లీగల్లీ తిరిగి స్థానిక నేతలతో కలిసి ముమ్మర ప్రచారం నిర్వహించి గెలుపులో భాగస్వాములయ్యారు. దీంతో పాలమూరు పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీ(బీ)ఆర్ఎస్ ఘన వి జయం సాధించడం వెనుక ఉమ్మడి జిల్లా లు, ఎమ్మెల్యేల పాత్ర ఎంతో ఉన్నది. ఓటర్లను కలి సి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఆయా నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు గలీగల్లీ తిరిగి ముమ్మర ప్రచారం చేశారు. స్థానిక కార్యకర్తల ఇండ్లలో మకాం వేసి పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. మునుగోడు కార్యకర్తలకు మంత్రులు, ఎమ్మెల్యేల బలం తోడవడంతో ‘కారు’ దూసుకుపోయింది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్డ్ ఖరారు కాగానే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి కీలక మండలాలు, గ్రామాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు.
దీంతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు. తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని.. ఎక్కువ సమయం ప్రచారానికే కేటాయించారు. వీలు చిక్కినప్పుడల్లా స్థానిక నియోజకవర్గాలకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పొలింగ్ వరకు అన్నీ తామై చూసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జిల్లా టీంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్చార్జిలుగా వ్యవహరించిన అన్ని గ్రామాల్లో కారు దూకుడు కనబరిచిం ది. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఇన్చార్జి ఇచ్చిన భీమన్‌పల్లి, కమ్మగూడెం గ్రామాల్లోని నాలుగు పోలింగ్ బూత్‌లలో టీఆర్ఎస్కు 613 ఓట్ల మెజార్టీ వచ్చిం ది. ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చిన మంత్రుల్లో ఆయ నే టాప్‌లో నిలిచారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బాధ్యతలు తీసుకున్న చౌటుప్పల్ ము న్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం, లింగోజి గూడెంలో ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీలకు కళ్లెం వే యడంతో టీఆర్ఎస్కు గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రచారం చేసిన చండూరు మండలం ఇడికూడ, పు ల్లెం గ్రామాల్లోని ఎంపీటీసీ పరిధిలో 594 ఓట్ల మె జార్టీ వచ్చింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ప్రచారం చేసి న దేవత్‌పల్లి, రేఖ్యాతండాల్లో 253 ఓట్ల మెజార్టీ వచ్చింది.
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంస్థాన్ నారాయణపూర్‌లో విపక్షాలకు ఓట్లు పడకుండా అడ్డుకట్ట వేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బాధ్య తలు చేపట్టిన శివన్నగూడెం.. కాంగ్రెస్ అభ్యర్థి బం ధువులు ఎక్కువగా ఉన్న ఊరు. గతంలో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఇచ్చిన చోట ఎమ్మెల్యే ఆల కృషి ఫలితంగా టీ(బీ)ఆర్ఎస్కు 79 ఓట్ల మెజార్టీ వ చ్చింది. విప్ గువ్వల బాలరాజు ప్రచారం చేసిన నాంపల్లి మండలం గట్లమల్లెపల్లి, మెళ్లవాయి, కేతేపల్లి గ్రామాల్లో గతంలో కంటే టీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా దెబ్బకొట్టారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి బాధ్యతలు తీసుకు న్న నాంపల్లి మండలం తుమ్మలపల్లి, రేవల్లి గ్రామాల్లో 265 ఓట్ల మెజార్టీ వచ్చింది. వచ్చే ఎ న్నికల్లో ఉమ్మడి జి ల్లాలో గులాబీ జెండా ఎగురుతుం దని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు.