నాగర్‌కర్నూల్, నవంబర్ 1 : చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ స ర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘ టన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. ఊర్కొండ గ్రామానికి మేకల శ్రీనివాసులు 2013 నుంచి 2018 ఏడాది వరకు సర్పంచ్‌గా కొనసాగాడు. ఆయన హయాంలో గ్రా మంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పనులు పూర్తి చేసినా బిల్లులు ఇంకా రాలే దు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల తో మొరపెట్టుకున్నాడు. అయినా లాభం లే కపోయింది. దీంతో అప్పుల పాలైనట్లు బాధితుడు వాపోయాడు. బిల్లుల మంజూరుకు చెప్పులరిగేలా ఎన్నిసార్లు తిరిగినా ప్రతిఫలం లేకపోయిందన్నారు. ఇటీవల కొన్ని బిల్లులు మంజూరైనప్పటికీ ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ఎప్పటికప్పుడు వాడుతూ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను చేసిన పనులకు అక్టోబర్ 3న రూ.4 లక్షలకుపైగా బిల్లు మంజూరైతే గ్రామపంచాయతీ అకౌంట్లో పడిందన్నారు. ఈ విషయమై ప్రస్తుతం ఉన్న సర్పంచ్, కార్యదర్శిని ప్రశ్నిస్తే తనకు ఒక చెక్కు మాత్రమే ఇచ్చారని తెలిపాడు. అందులో కూడా జీరో అమౌంట్ ఉందని తెలియజేయగా వాడుకున్నామని చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కలెక్టర్, అదనపు కలెక్టర్‌ను కలవడంతో డీఎల్పీవోకు రాశారని తెలిపాడు. డీఎల్‌పీవోతో శనివారం మాట్లాడినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు చెప్పాడు. దీంతో మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని ట్రెజరీ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నిస్తుండగా.. అక్కడున్న పోలీసులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వెంటనే జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించి చికిత్స పొందుతున్నాడు.