బాలానగర్, నవంబర్ 1: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. మండలంలోని పె ద్దాయపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణం, తెలంగాణ క్రీడాప్రాంగణం, సీఎస్ఆర్ కింద నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణం పనులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు సులభమైన పద్ధతిలో విద్యాబోధన చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఎంపీడీవో కృష్ణారావు, కార్యదర్శి అనిల్, వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో ఎంపీవో తనిఖీ
కోయిలకొండ, నవంబర్ 1: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం వడ్డించాలని మండల ప్రత్యేకాధికారి డాక్టర్ మధుసూదన్గౌడ్ సూచించారు. మంగళవారం ఇబ్రహీంనగర్, మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. చిన్నారులకు అందించే పౌష్టికాహారం, భోజనాన్ని పరిశీలించారు. తాగునీటి వసతి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు తగ్గకుండా చూడాలని హెచ్ఎంలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, సర్పంచులు కృష్ణ య్య, రాములు, ఎంపీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.