
అమ్రాబాద్, డిసెంబర్ 17: రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని సింగిల్‌విండో చైర్మన్ పోషం గణేశ్ రైతులకు సూచించారు. అమ్రాబాద్, పదర మండలాల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1960, గ్రేడ్ బీ రూ.1940 నిర్ణయించారని తెలిపారు. రైతులు ఏఈవో ద్వారా టోకెన్ తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్లు శంకర్, లింగాచారి, రమేశ్‌యాదవ్, సైదులు, కృష్ణయ్య, సీఈవో జనార్దన్, నేతలు జగపతి, శ్రీనివాసులు, నారాయణ పాల్గొన్నారు.
పదరలో..
మండల కేంద్రంలో సింగ్ విండో చైర్మన్, డైరెక్టర్ల, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంబాబునాయక్, సింగిల్ విండో డైరెక్టర్లు లింగాచారి, శంకర్ మాదిగ, రమేశ్‌యాదవ్, సర్పంచ్ ప్రవీణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జగపతి, గ్రామాధ్యక్షుడు నారయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, నాయకులు బక్కన్న, నిరంజన్, శ్రీను, బక్కయ్య, ఎల్లయ్య, ఏఈవో మౌనిక, శ్రావణి, యామిని జనార్దన్ పాల్గొన్నారు.
10వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
మండలంలో రైతుల నుంచి ఇప్పటివరకు 10వేల379క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు విండో చైర్మన్ నర్సయ్య, సీఈవో రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొండనాగుల గ్రామంలో శుక్రవారం రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతాన్ని అధికారులు పరిశీలించారు. మండలంలో ఇప్పటి వరకు 230 మంది రైతుల నుంచి 25వేల948బ్యాగులతో దాదాపు 11వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తుమ్మెన్‌పేట, కొండనాగుల, బల్మూరు, గట్టుతుమ్మెన్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.