నారాయణపేట టౌన్, అక్టోబర్ 31: సంస్థానాలను విలీనం చేసి ప్రజల్లో సమైక్యస్ఫూర్తిని నింపిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని శిశుమందిర్ ఉన్న పాఠశాల ప్రధానాచార్యులు దత్తూచౌదరి అన్నారు. సర్దార్ పటేల్ జయంతిని పట్టణంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకొన్నారు. సర్దార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి రజాకార్ల దౌర్జన్యాల నుంచి విముక్తి కల్పించిన నాయకుడని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్(బాయ్స్)లో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అందించిన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఊట్కూర్, అక్టోబర్ 31: సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని చిన్నపొర్ల జెడ్పీహెచ్ఎస్, నిడుగుర్తి యూపీఎస్, శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ సమైక్యతా దినోత్సవా న్ని నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, జగన్నాథ్‌రావు, శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ సమైక్యతను కాపాడ డంలో పటేల్ చేసిన కృషిని కొనియాడారు. పటేల్స్ఫూర్తి తో విద్యార్థులు ముందుకు సాగాలని, చిన్నతనం నుంచే దేశభక్తి, జాతీయతా భావాన్ని కలిగి ఉండాలని సూచించా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, శక్తి ఫౌం డేషన్ సభ్యులు పాల్గొన్నారు.
మక్తల్, అక్టోబర్ 31: మక్తల్ మండలం పంచలింగాల గ్రామంలో సోమవారం ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీంరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 సంస్థానాలకుపైగా స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్‌కు దక్కిందన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు. పటేల్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమార్ ప్రహ్ల్లాద్, జైపాల్‌రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణ, అక్టోబర్ 31 : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిజాముద్దీన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సంస్థానాలకు దేశంలో కలిపేందుకు చేసిన కృషిని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఏక్తాదివస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మరికల్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని మండల కేంద్రంలోని సర్దార్‌పటేల్ రోడ్డులో యువకులు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ సంస్థానాలను విలీనం చేయడంలో భాగంగా రజాకార్లనుంచి తెలంగాణ ను విముక్తి చేసిన ధీరుడు సర్దార్ పటేల్ అన్నారు. కార్యక్ర మంలో సతీ శ్, మొగులయ్య, అంజి, ఆంజనేయులు, శివ, అశోక్, ఎల్లప్ప, బాలరాజు, రామకృష్ణ, భీంరాజ్, అడివిగోని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్,అక్టోబర్,31: మండలంలోని తిర్మలాపూర్,లక్ష్మీపూర్,జాజాపూర్,బసిరెడ్డిపల్లి పాఠశాలలతో పాటు ఇతర పాఠశాలల్లో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు జనార్దన్‌రెడ్డి, జనార్దన్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గ్గొన్నారు.