నారాయణపేట, అక్టోబర్ 31: అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి మాట్లాడారు. అమరవీరులు సమా జం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం సంఘవిద్రోహ శక్తులచే పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేశారన్నారు.రక్తదానంపై అపోహలు తొలగించుకొని రక్తదానం చేయాలన్నారు. తలసేమియా, క్యాన్సర్, హీమోఫీలియా తదితర రోగాలతో బాధపడేవారికి, ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై సురేశ్, ఉమ్మడి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్, జిల్లా చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, సభ్యులు జగదీశ్, చెన్నారెడ్డి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, అక్టోబర్ 31: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మక్తల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంత మైనట్లు సీఐ సీతయ్య తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, మక్తల్ లయన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించిన శిబిరంలో150 మందికిపైగా రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని తరచూ రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మక్తల్ ఎస్సై పర్వతాలు, ఊట్కూర్ ఎస్సై రాములు, నరేందర్, విజయభాస్కర్, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నటరాజ్, జిల్లా ప్యాట్రన్ మెంబర్లు వీరేశం, అనుగొండ శ్రీనివాసులు, మక్తల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సూగూర్ జైపాల్ రెడ్డి, సెక్రటరీ డీవీచారి, అంబాదాస్, సత్య ఆంజనేయులు, పృథ్వీరాజ్, అశోక్, అంజన్‌ప్రసాద్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, శ్రీకాంత్, రాంమాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, అక్టోబర్ 31: నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డ్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణ శి వారులోని భీమండి కాలనీలో కార్డ్డన్సెర్చ్ నిర్వహించారు. సీఐ లు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, స్పెషల్ పార్టీ సి బ్బంది కలిసి మొత్తం 125 ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణపత్రాలులేని 28 ద్విచక్ర వాహనాలను స్వా ధీనం చేసుకున్నారు. ధ్రువీకరణపత్రాలు చూపిస్తే వాహ నా లను తిరిగి ఇస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, జనార్దన్, ఎస్సైలు సురేశ్, శ్రీనివాస్‌రావు తది తరులు పాల్గొన్నారు.