జడ్చర్ల, అక్టోబర్ 27 : అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం గా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని జడ్చర్ల ఎమ్మె ల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో భాగంగా గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. మునుగోడు మండలం దేవత్‌పల్లి, రేఖ్యాతండా లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తరఫు న ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నాయన్నారు. మన పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ప్రతి ఇంటికి ఏదో రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మునుగోడు ఓటర్లంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, కూసుకుంట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దేవత్‌పల్లికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి లక్ష్మారెడ్డి ఆహ్వానించారు. ప్రచారంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ చిన్నపల్లి శ్రీకాంత్‌రెడ్డి, గిరియాదవ్, ఇమ్మూ తదితరులు పాల్గొన్నారు.
శివన్నగూడెంలో ఎమ్మెల్యే ఆల ప్రచారం..
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విస్తృతంగా పాల్గొన్నారు. మర్రిగూడ మండ లం శివన్నగూడెంలో నాయకులతో కలిసి ఇంటింటి ప్ర చారం చేపట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను అ త్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించా రు. టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గులాబీ పా ర్టీని గెలిపిస్తాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నాయకు లు యత్నించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు కదిరె శేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రాజశేఖర్‌రెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం పాల్గొన్నారు.