అగ్ర హీరో పవన్‌కల్యాణ్ కొత్త సినిమా అప్డేట్స్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. జైత్రరామ్ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇదని, ఇందులో యువ అగ్ర హీరో ఒకరు భాగం కాబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం.
ఇప్పటికే సదరు యువ హీరోతో సంప్రదింపులు పూర్తయ్యాయని, అతను సినిమాలో భాగం కావడానికి సంతోషంగా అంగీకరించారని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదిలావుండగా పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది.