నాని నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. సికింద్రాబాద్ నేపథ్యంలో నడిచే ఈ కథలో జడల్ అనే మాస్ పాత్రలో కనిపించబోతున్నారు నాని. ‘జడల్’ ఫస్ట్‌లుక్‌లో నాని వేషధారణ, సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఆధిపత్యానికి, పీడనకు వ్యతిరేకంగా తన జాతి రక్షణ కోసం ఓ యువకుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. తాజా షెడ్యూల్లో ‘ఆయా షేర్’ అంటూ సాగే ఇంట్రోసాంగ్ను తెరకెక్కిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ పాటకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హుషారైన బీట్‌ను సిద్ధం చేశారని, పక్కా మాస్ గీతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.
ఈ వేసవిలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.