నారాయణపేట, అక్టోబర్ 25 : పేదలకు అండగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నా రు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. పట్టణానికి చెందిన అంబమ్మకు రూ. 17,000, చింతమ్మకు రూ.11,000, అర్చనకు రూ.24, 000, మాణిక్‌రెడ్డికి రూ.3,10,000ల చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని కొత్తపల్లితండాకు చెందిన మోహన్‌నాయక్ కుమారుడు మాస్టర్ శ్రీనుకు అత్యవసర గుండె చికిత్స నిమిత్తం మంజూరైన రూ.లక్ష ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పట్ట ణ ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభా ష్, సీనియర్ నాయకులు చంద్రకాంత్, వెంకట్రాములు, శివరాంరెడ్డి పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు కృషి
నారాయణపేట టౌన్, అక్టోబర్ 25 : ప్ర భుత్వం బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కా ర్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం కలెక్టర్ శ్రీహర్షతో కలిసి కుమ్మరి యంత్రాలను రిబ్బన్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరి కులస్తులు ఆర్థికంగా, వ్యాపారవేత్తలుగా ఎ దగాలని సూచించారు. మొత్తం ఏడుగురు మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన కుమ్మరి యంత్రాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కుమ్మరి యంత్రాలను పంపిణీ చేసినందుకుగానూ కుమ్మరి సంఘం నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.