పాలమూరు, అక్టోబర్ 25: బీఎస్ఎన్ఎల్,ఎల్ఐసీ వంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఫర్ సేల్ అనే తీరుగా బోర్డు పెట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలువునా అమ్మేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేసి యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని పేర్కొనారు. ఉద్యోగాలు కల్పించకుండా పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తుందని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పరిధిలోని రెండో వార్డులో పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వామపక్ష నేతలు, కార్యకర్తలు వెంటరాగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి అడుగడునా జనం నుంచి చక్కని స్పందన లభించిందన్నారు.