మక్తల్ టౌన్, అక్టోబర్ 23 : నేటి పోటీ ప్రపంచంలో కా లానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో యువకులు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతిఒక్కరికీ వ్యక్తిగతంగా, స్వీయ ఆత్మరక్షణ కావాల్సిందేనని కరాటేపై ఎక్కువ స్థాయిలో మక్కువ చూపిస్తున్నారు. పట్టణంలో కరాటే అకాడమీలు వెలుస్తున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతున్నది. ప్రతిరోజు రెండు గంటలపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. కరాటే శిక్షణతో ఆత్మైస్థెర్యం, దేహదారుఢ్యం పెంపొందుతున్నది. శిక్షణ తమను తాము కాపాడడానికి సహాయపడుతున్నది. తల్లిదండ్రులు తమ పి ల్లలకు కరాటే శిక్షణను ఇప్పిస్తున్నారు. కరాటే నేర్చుకునేందుకు మారుమూల గ్రామాల నుంచి సైతం విద్యార్థులు పట్టణానికి వస్తున్నారు. పట్టణంలోని శిక్షణా కేంద్రంలో 1000 మందికి పై విద్యార్థులు శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌ను సాధించి కరాటేలో రాణిస్తున్నారు.
మక్తల్‌తోపాటు పరిసర గ్రామాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వి ద్యార్థులు కరాటే శిక్షణకు వస్తున్నారు. వా రిలో ఎక్కువ సంఖ్యలో బాలికలే శిక్షణ పొం దుతున్నారు. పాఠశాల ప్రారంభం సమ యం కంటే ముందుగానే ఉదయం 6 నుం చి 8 గంటల వరకు విద్యార్థులకు కరాటేలో శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో విద్యార్థులు రాణించే విధం గా శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ కాలం ముగిసిన తర్వాత విద్యార్థులకు కరాటేలో పరీక్ష లు నిర్వహించి వివిధ స్థాయిలో బెల్టుల తోపాటు ప్రశంసాపత్రాలను నిర్వాహకులు అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల వి ద్యార్థులకు ఉచితంగా కరాటేలో శిక్షణ అం దిస్తున్న అకాడమీ నిర్వాహకులను జిల్లాస్థా యి పోలీస్ అధికారులు ప్రశంసిస్తున్నారు. కరాటేలో శిక్షణ పొందిన యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ అందిస్తూ ఉపాధి పొందుతున్నారు.
కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థులు ఢిల్లీ, వైజాగ్ ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రదర్శనలో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సూపర్ బుడోకాన్ అకాడమీ కరాటేలో ప్రత్యేకంగా శిక్షణ పొందాను. మక్తల్ ప్రాంతంలోని ప్రతి విద్యార్థికి కరాటేలో శిక్షణ అందించాలనే లక్ష్యం. డ్రాగన్ షోటోకాన్ కరాటే డూ ఇండి యా పేరుతో శిక్షణ కేంద్రం ప్రారంభించాను. 20 ఏండ్లుగా విద్యార్థులకు కరాటేలో శిక్షణ అందిస్తున్నాం. శిక్షణ నుంచి ఎంతో మంది విద్యార్థులు నైపుణ్యతను సాధిస్తున్నారు.
– శాలమ్ బిన్ ఉమర్, డ్రాగన్ షోటోకాన్ కరాటే డూ ఇండియా అకాడమీ చైర్మన్