స్వయంభు ఓ సాంకేతిక అద్భుతం
‘కార్తికేయ 2’తో పానిండియా స్థాయి విజయాన్ని అందుకున్న నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న హిస్టారికల్ ఎపిక్ ‘స్వయంభు’. ఇది నిఖిల్ నటిస్తున్న 20వ సినిమా కావడం విశేషం. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలు. భరత్కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు.
‘కార్తికేయ 2’తో పానిండియా స్థాయి విజయాన్ని అందుకున్న నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న హిస్టారికల్ ఎపిక్ ‘స్వయంభు’. ఇది నిఖిల్ నటిస్తున్న 20వ సినిమా కావడం విశేషం. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలు. భరత్కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్ని ఈ నెల 11న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో నిఖిల్ యాక్షన్ లుక్లో కనిపించారు.
‘ఈ సినిమా ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తున్నది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ పాత్ర కోసం పలు యుద్ధవిద్యాల్లో నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యారు. సాంకేతికంగా ఈ సినిమా ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: విజయ్ కామిశెట్టి, కెమెరా: కె.కె.సెంథిల్కుమార్, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

