మక్తల్ టౌన్, అక్టోబర్ 23 : రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం లబ్ధ్దిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సర్కార్ దవాఖానలన్నీ అభివృద్ధి పర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తికి రూపాయి ఖర్చు లేకుం డా ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో సీఎం స హాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సా యం అందుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మండలంలో మాదన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్ద ఆంజనేయులుకు రూ.60 వే లు, భగవాన్‌పల్లికి చెందిన ఆంజనేయులుకు రూ.60వేలు, వనాయికుంటా గ్రామానికి చెందిన సాయన్నకు రూ.19,5 00లు, ఆంజనేయులుకు రూ.60 వేలు, కాచ్వార్ గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డికి రూ.28 వేలు, ఊట్కూర్ మండ లం బిజ్వార్ గ్రామానికి చెందిన అశోక్‌కు రూ.24వేల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.