వనపర్తి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : ప్ర స్తుతం నేరాల తీరు మారుతున్నదని, అర్బిట్రేషన్స్ (ఒప్పంద సంబంధ వివాదాలు), ట్రేడ్‌మార్క్, సైబర్‌క్రైం వంటి కొత్త తరహా నేరాలను ఎదుర్కోవాల్సి వస్తున్నద ని హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ నాగార్జున, సాంబశివరావు నాయుడు తెలిపారు. ఇందుకనుగుణంగా న్యాయవాదులు మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవనంతోపాటు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హైకోర్టు జ డ్జి సాంబశివరావుతో కలిసి న్యాయమూర్తి నాగార్జున ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సకల సౌకర్యాలతో పూర్తిస్థాయి నూతన కోర్టు భవనాలు త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం సహకారం అం దిస్తున్నదని కితాబిచ్చారు. మౌలిక సౌకర్యాల కల్పనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమ ణ చొరవతో ప్రతి జిల్లాలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. వీటికి శా శ్వత ప్రాతిపదికన కోర్టు సముదాయాలు నిర్మించుకోవడానికి రూ.200 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
ప్రభుత్వం కోర్టుల నిర్వహణకు ప్రత్యేక బ డ్జెట్ ఇస్తుందన్నారు. ఏది అడిగినా సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. స్టాఫ్ క్వార్టర్స్, ఐటీ సర్వీస్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులే కాకుం డా కోర్టుకు న్యాయం కోసం వచ్చే వారూ డిగ్నిటీగా ఉం డేలా కొత్తగా వచ్చే కోర్టు భవనాల్లో సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో శాశ్వత కోర్టు భవనానికి 20 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయమన్నారు.
త్వరలో అదనపు జిల్లా కోర్టు వనపర్తికి వస్తుందని, పిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు అడిగార ని, ఇందుకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. న్యాయవ్యవస్థ అంటే కోర్టులు, బిల్డింగ్లు, ఫర్నిచర్ కాదని, న్యాయం కోరే ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందడమని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు పని చేయలేని పరిస్థితిలోకి వెళ్లినా.. న్యాయమూర్తులు సెలవు తీసుకోకుండా పనిచేసి కేసులు పరిష్కరించారని గుర్తు చేశారు. పోక్సో కేసుల తీరును నిశితంగా పరిశీలించాల్సిన అవసరముందని సూచించారు.
వనపర్తి జిల్లా కోర్టులోనే న్యాయవాదిగా తన ప్రస్థానం ప్రారంభించానని, హైకోర్టు న్యాయమూర్తి హోదాలో నే డు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 31 ఏండ్లుగా న్యా యవ్యవస్థలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో పనిచేశానని తెలిపారు. మౌలిక సౌకర్యాలు, వసతుల కోసం హైకోర్టు నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ఇక్కడి బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఉండటంతో న్యాయస్థానాల అభివృద్ధికి తోడ్పాటు అందజేస్తున్నారని వివరించారు.
అనంతరం న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు మాట్లాడుతూ 1991లో తనకు మొట్టమొదటి పోస్టింగ్ వనపర్తిలో వచ్చిందని తెలిపారు. కొత్త ప్రాంతం ఎలా ఉంటుందోనని కొంత ఆందోళన చెందానని, ఇక్కడికి వచ్చాక త్వరగానే కలిసిపోయానని అన్నారు. ఇక్కడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవనం ప్రారంభించడానికి రావడం ఆనందంగా ఉందన్నారు. అప్పటికీ.. ఇప్పటికీ వనపర్తిలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు.
కాలానికి తగ్గట్టుగా మారాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
కాలం మారుతున్న సమయంలో న్యాయ వ్యవస్థ మరింత సోషలైజ్ కావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అ భిప్రాయపడ్డారు. నేరాలు పరంపర కొనసాగుతున్నప్పటికీ వాటి స్వభావం, స్వరూపం మారుతున్నదన్నారు. నూతన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయ ని, కాలానుగుణంగా న్యాయవ్యవస్థ తీరుతెన్నులు మార్చుకోవాలని సూచించారు. వివాదాలు గతంలో మాదిరిగా కాకుండా భిన్న రూపాలు సంతరించుకుంటున్నాయని తెలిపారు. ఆర్థికపరమైన నేరాలు, కంప్యూటర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సామాన్య నేరాలు తగ్గుతున్నాయని అన్నా రు. సామాన్యులు నేరాలు చేసే సంఖ్య తగ్గుతుందని, శాస్త్ర సాంకేతిక జ్ఞానం పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌గా నేరాలు చేస్తున్నారన్నారు.
భవిష్యత్ ప్రాతిపదికన, కాలానికి తగ్గట్టుగా డెలివరీ సిస్టాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తులే ప్రజల వద్దకు వెళ్లి వివాదాలను పరిష్కరించాల్సిన పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. వనపర్తి సబ్‌కోర్టు ఏర్పాటులో తన పాత్ర ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ సన్మానించింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి హుజైబ్ అహ్మద్‌ఖాన్, జడ్జీలు జానకి, రజిని, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వారావు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌కుమార్, ప్రధాన కార్యద ర్శి విజయ్‌భాస్కర్, సీనియర్ న్యాయవాదులు చంద్రశేఖర్‌రావు, బాల్‌రెడ్డి, మోహన్‌గౌడ్, ఉత్తరయ్య, కిరణ్‌కుమార్, షాకీర్‌హుస్సేన్, బార్ అసోసియేషన్ సభ్యురాలు జయలక్ష్మి పాల్గొన్నారు.