అచ్చంపేట టౌన్, అక్టోబర్ 22 : ఆధునిక పద్ధతులు, నైపుణ్యంతో బొప్పాయి పంటను సాగు చేస్తూ వందలా ది టన్నుల దిగుబడులను సాధిస్తున్నారు. టైఫాయిడ్, డెంగీ వంటి రోగాలకు బొప్పాయి ఔషధంగా పని చే స్తుందని వైద్యులు సలహాలు ఇస్తుండడంతో బొప్పాయి ఆకు, పండ్లకు మరింత ఆదరణ పెరిగింది. బహిరంగ మార్కెట్లో బొప్పాయి పండు కిలో రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అచ్చంపేట డివిజన్ పరిధిలో 58 మంది రైతులు 270 ఎకరాల్లో బొప్పాయి ని సాగు చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
అచ్చంపేట మండలంలోని బొల్గట్పల్లిలో అనేక మంది రైతులు బొప్పాయి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అచ్చంపేటకు చెందిన వంగ భగవంత్‌గౌడ్ 3.21 ఎకరాల్లో ఐదేండ్లుగా బొప్పాయిని సాగుచేస్తున్నా డు. 2014 డిసెంబర్లో ఏపీ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా నర్సరీ నుంచి మొలకలు తీసుకొచ్చి ఎకరాకు రూ. లక్ష చొప్పున ఖర్చు చేసి సాగు చేశాడు. పంట వేసిన ఎ నిమిది నెలల తరువాత కాయలు తెంపాడు. ప్రస్తుతం 60 టన్నులను హైదరాబాద్‌లోని కోహెడ మార్కెట్‌కు, ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టన్ను దాదాపుగా రూ.15 వేలు ధర పలుకుతుందన్నారు. కొత్తపేట మార్కెట్‌ను మార్చడం వల్ల అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నాడు. సాగులో ఆధునిక పద్ధతులు పా టిస్తూ సాగు చేయడంతో బొప్పాయికి ఆదర ణ పెరిగిందంటున్నాడు. అధిక వర్షాల వల్ల దిగుబడి కాస్త తగ్గిందని.., మార్కెట్ లో రేటు లేనందున గతం తో పోలిస్తే ఈ సారి ఆదాయం కూడా పడిపోయిందని భగవంత్‌గౌడ్ వాపోతున్నాడు. ఉద్యానవన శాఖ అధికారులు బొప్పాయి విత్తనాలు, క్రిమిసంహారక మందులను సబ్సిడీపై అందజేస్తే మ రింత సాగు పెరుగుతుందని చెబుతున్నా డు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే ప రిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. భగవంత్గౌడ్ను ఆదర్శంగా తీ సుకొని పల్కపల్లి రైతులు శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, హరిశంకర్‌రెడ్డి, తిరుపతయ్య, శేఖర్‌రె డ్డి బొప్పాయి సాగు చేస్తున్నారు.