పాలమూరు, అక్టోబర్ 22 : మును గోడులో కారు గుర్తు విజయం తథ్యమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద ఉన్న సినిర్జీ కెమికల్స్ కంపెనీలో మంత్రి ప్రచారం నిర్వహించా రు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడాలని కోరారు. అలాగే ఆర్కిమెడిస్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనూ ఎన్నికల ప్ర చారం చేపట్టారు. ఉద్యోగులు, కార్మికులను క లిసి గులాబీ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అ భ్యర్థించారు. చౌటుప్పల్‌లోని వివిధ ప్రాంతా ల్లో ప్రచారం చేశారు. మంత్రి వెంట టీఆర్ఎస్కే వీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆటో విభాగం నాయకుడు మారయ్య, చౌటుప్పల్ మండల ప్రెసిడెంట్ కృష్ణ ఉన్నారు.
రాష్ట్రంలో ప్రగతి బాటలు..
జడ్చర్ల, అక్టోబర్ 22 : సీఎం కేసీఆర్ హ యాంలోనే రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నా రు. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. శనివారం మునుగోడు ని యోజకవర్గంలోని నాంపల్లి మండలం రేఖ్యానాయక్ తండాలో ఆయన ఇంటింటి ప్రచారం ని ర్వహించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించా రు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమమే పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చే శారు. మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. అంతకుముందు ఎ మ్మెల్యేకు మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. కారు గుర్తుకే తాము ఓటు వేస్తామని వెల్లడించారు. అనంతరం తండాకు చెందిన వార్డు సభ్యురాలు కళావతితోపాటు పలువురు ఎ మ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
ఓటర్లతో మమేకమై..
మూసాపేట, అక్టోబర్ 22 : మునుగోడు ప్రచారంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ము మ్మరంగా పాల్గొన్నారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెంలోని ఓటర్ల వద్దకు ఆయన వెళ్లి కూసుకుంట్లను అఖండ మె జార్టీతో గెలిపించాలని కోరారు.
అభివృద్ధే టీఆర్ఎస్ను గెలిపిస్తుంది
కల్వకుర్తి, అక్టోబర్ 22 : రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను పార్టీని గెలిపిస్తుందని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లి మండలం తుమ్మలపల్లి, రేవల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ని లబడాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నమ్మొద్దని సూచించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆ పార్టీలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలపల్లిలో గోనే వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ నాగమణి వెంకటయ్య, కేశవులు, ఆంజనేశ్వర్రావు, రమేశ్, వెంకటయ్య, శేఖర్‌రావు, గోవర్ధనాచారి, సైదులు తదితరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కం డువాలు కప్పారు. ప్రచారంలో స్థానిక సర్పంచ్ గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.