వనపర్తి టౌన్, అక్టోబర్ 19 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలతో మా నసికోల్లాసం కలుగుతుందని నాగర్‌కర్నూ ల్ ఎంపీ పోతుగంటి రాములు విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 6వ జోనల్‌స్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపా టు క్రీడల్లో రాణించి దేశానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలని సూ చించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
మూడు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లాల జోనల్‌స్థాయి పోటీల్లో అండర్-14 కబడ్డీ పోటీల్లో విన్నర్‌గా జడ్చర్ల, రన్నర్‌గా మహబూబ్‌నగర్, వాలీబాల్ విభాగంలో విన్నర్‌గా వనపర్తి, రన్నర్‌గా జహీరాబాద్, బాల్బ్యాట్మింటన్లో విన్నర్‌గా వనపర్తి , రన్నర్‌గా కేటీదొట్టి, హ్యాండ్‌బాల్ విభాగంలో విన్నర్‌గా కల్వకుర్తి, రన్నర్‌గా వనపర్తి, చెస్ సింగిల్ విభాగంలో రేవతి ప్రథమస్థానం, పాయల్ ద్వితీయస్థానం లో నిలిచారు.
అండర్-17 విభాగం కబడ్డీలో వనపర్తి విజేతగా నిలువగా, రన్నర్‌గా పరిగి, ఖోఖోలో విన్నర్‌గా పరిగి, ర న్నర్‌గా తాండూరు, వాలీబాల్‌లో వనపర్తి విన్నర్‌గా, రన్నర్‌గా కల్వకుర్తి, బాల్‌బ్యాడ్మింటన్‌లో కల్వకుర్తి విన్నర్‌గా, రన్నర్‌గా వనపర్తి, బ్యాట్బాల్లో వనపర్తి విన్నర్‌గా, మహబూబ్‌నగర్ రన్నర్‌గా, టెన్నికాయిట్‌లో కల్వకుర్తి విన్నర్‌గా, వనపర్తి రన్నర్‌గా, చెస్ సింగిల్‌లో శ్రీవాణి విన్నర్‌గా, కలహార్ రన్నర్‌గా, క్యారమ్స్ డబుల్ విభాగంలో విన్నర్‌గా పరిగి, రన్నర్‌గా తాం డూరు పాఠశాలలు నిలిచాయి. అండర్-19 విభాగం కబడ్డీలో జడ్చర్ల విన్నర్‌గా, రన్నర్‌గా జంగమల్లి, ఖోఖోలో కల్వకుర్తి విన్నర్‌గా, తాండూరు రన్నర్‌గా, వాలీబాల్‌లో కల్వకుర్తి విన్నర్‌గా, మహబూబ్‌నగర్ రన్నర్‌గా, హ్యాండ్‌బాల్‌లో వనపర్తి విన్నర్‌గా, జహీరాబాద్ రన్నర్‌గా, చెస్ సింగిల్స్‌లో వనపర్తికి చెందిన కావేరి విన్నర్‌గా, కల్వకుర్తి విద్యార్థిని రన్నర్‌గా, క్యా రమ్స్ డబుల్స్ విభాగంలో జడ్చర్ల విన్నర్‌గా, మహబూబ్‌నగర్ రన్నర్‌గా నిలిచిం ది. కార్యక్రమంలో క్రీడల అధికారి రమేశ్‌కుమార్, కోఆర్డినేటర్ రవికుమార్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు కోళ్ల వెంకటేశ్, ప్రిన్సిపాల్ గోవర్ధన్, ఆర్సీవోలు నాగార్జు న, కల్యాణి , పీఈటీలు స్వాతి, యశో ద, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.