యాసంగి సాగుకు రైతన్నలు సన్నద్ధం కానున్నారు. వానకాలం పంటల సీజన్ ముగియడంతో ఇక మరో సీజన్‌కు సమాయత్తమవుతున్నారు. ఈసారి వేరుశనగ పంట వైపు కర్షకులు మొగ్గు చూపనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,64,552 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖాధికారుల అంచనా.. ఇక రెండో ప్రాధాన్య పంటగా వరి వైపు మొగ్గు చూపనున్నారు. ఈసారి ఉద్యాన పంటలతో కలిపి 3.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. ఎరువుల అంచనాలను కూడా తయారు చేశారు. గతేడాది 37,617 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. ఈసారి 44 వేల మెట్రిక్ టన్నులు అవసరమని నివేదిక తయారు చేశారు. వానకాలంలో పండించిన వరి, పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19 (నమస్తే తె లంగాణ) : వానకాలం సాగు ముగియడంతో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతు న్నారు. ఇప్పటికే వేసిన వరి, పత్తితోపాటు ప లు రకాల పంటలు చేతికి వచ్చాయి. వరి కోత దశకు చేరుకున్నది. పత్తి గూడలు తీస్తున్నారు. రైతులు స్థానికంగా పంటలు అమ్మకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వచ్చే నెలలో పత్తి, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇలా వానకాలం పంట పూర్తయ్యింది. దీంతో రైతులు యాసంగి పంటల సాగుపై యోచిస్తున్నారు. వరి కొనుగోళ్లపై ఆంక్షలు ఉండక పోవడంతో సాగు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి భారీగా వర్షాలు కురవడంతో ఎంజీకేఎల్ఐతోపాటు పలు ప్రాజెక్టులు నీటిని నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నాయి. దీనికితోడు చెరువులన్నీ 90 శాతానికిపైగా నిండుకుండలను తలపిస్తున్నాయి. కొ న్ని అలుగులు పారుతున్నాయి. ఫలితంగా యాసంగి పంటలకు నీటి సమస్య వచ్చే పరిస్థితులు లేవు. రైతన్నలకు నిరంతరంగా వి ద్యుత్ సరఫరా జరుగుతున్నది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పథకాలన్నీ తెలంగాణ ప్రభుత్వం సకాలంలో అందజేస్తున్నది. ఇలా సంబురంగా సాగుతున్న రైతన్నలు మరోసారి యాసంగి సాగు చేపట్టనున్నారు. గతేడాదికి మించి పంటల సాగు జరిగే అవకాశమున్నట్లుగా అధికారుల అంచనా. ఇందులో వరి సాగు పెరిగే అవకాశమున్నది. కాగా, ఈసారి అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వేరుశనగ పంట సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. యాసంగిలో పత్తి గతేడాది కన్నా దాదాపుగా 20 వేల ఎకరాలు పెరిగే అవకాశమున్నది. గతేడాది 68,973 ఎకరాల్లో సాగు కాగా 82,767 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇక జొన్న, మొక్కజొన్న, మినుములు, పెసర్లు, శనగలు వంటి వాటితోపాటు ఉద్యానశాఖ ద్వారా కూడా 39 వేల ఎకరాల్లో సాగు జరిగే అవకాశమున్నది. ఇలా గతేడాది వ్యవసాయ శాఖ ద్వారా 2.54 లక్షల ఎకరాల్లో పంట సాగుకాగా ఈసారి 2.86 లక్షల ఎకరాల్లో సాగుకానున్నది. ఉద్యానవన పంటలతో కలిపి గత యాసంగిలో 2.91 లక్షల ఎకరాల సాగుఉండగా.. ఈసారి 3.25 లక్షల ఎకరాలు ఉండే అవకాశమున్నది. ఇక దీనికి సంబంధించి ఎరువుల అంచనా కూడా తయారు చేశారు. గతేడాది 37,617 మెట్రిక్ టన్నులు ఉండగా.. ఈసారి 44 వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని నివేదిక తయారు చేశారు. ఇలా వచ్చే యాసంగి పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.
యాసంగి ప్రణాళిక సిద్ధం..
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ యాసంగి లో వ్యవసాయ, ఉద్యానపంటలతో కలి పి 3.25 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశమున్నది. వరి పంట వి స్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా వేరుశనగ సా గు కానున్నది. జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతుందని అంచనా. ఇక జిల్లాకు గతేడాది 37 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అం చనాలుండగా.. ఈసారి 44వేల మె ట్రిక్ టన్నులుగా రూపొందించాం. త్వరలో ప్రభుత్వానికి ఈ అంచనాలను అందజేస్తాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, నాగర్‌కర్నూల్