వనపర్తి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : వనప ర్తి డిపో లాభాల బాటలో పయనిస్తున్నది. ఆర్టీసీ అంటే ఎప్పుడూ నష్టాలే.. ఇక బాగుపడదు.. మూసేయాల్సిం దే అని గతంలో విమర్శలు ఉండేవి.. రవాణా సేవల్లో మెరుగ్గా ఉన్నా.. ప్రయాణికులు అధికంగా ఆదరిస్తున్న టీఎస్ ఆర్టీసీకి నష్టాలను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐపీఎస్ అధికారి సజ్జనార్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించాక ప్రగతిరథ చక్రం పరుగులు పెడుతున్నది. ఇం దుకు ఉదాహరణ.. నిజాం కాలంలో ప్రారంభమై నేటికీ సేవలందిస్తున్న వనపర్తి బస్ డిపో. నష్టాలను పూడ్చుకుని లాభాలు తెచ్చి పెడుతున్నది. కేవలం ఒక్క నెలలో నే దాదాపు రూ. 2.17 కోట్ల లాభాన్ని ఆర్జించి మంచి ఫలితాలు రాబడుతున్నది. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ. 10 కోట్ల నష్టాన్ని పూడ్చుకుని శభాష్ అనిపించుకున్నది. 2021 సెప్టెంబర్‌లో రూ.12.49 కోట్ల నష్టాల్లో ఉన్న డిపో 2022 సెప్టెంబర్ ముగిసే వరకు కేవలం రూ.2.11 కోట్ల నష్టంతో నిలిచింది. ఒక్క నెలలలోనే దాదాపు రూ.2.17 కోట్ల లాభం సమకూరింది.
ఉమ్మడి జిల్లాలోనే రాబడి సాధించడంలో వనపర్తి డిపో టాప్‌లో నిలిచింది. ఈ రీజియన్‌లో 12 డిపోలు ఉండగా వనపర్తి డిపో మిగతా డిపోలను వెనక్కి నె ట్టింది. ఇప్పటికే సెప్టెంబర్ నెలలో లాభాలు ఆర్జించగా.. అక్టోబర్‌లో కూడా లాభాల బాటలో నడుస్తున్నది. అక్టోబర్‌లో రూ. 312.17 కోట్ల టార్గెట్ ఉండగా.. రూ. 302 కోట్లు సాధించి 96.97 శాతంతో రీజియన్‌లోనే అగ్రగామిగా నిలిచింది. కోస్గి డిపో 95.39 శాతంతో రెండో స్థానంలో, 94.62 శాతంతో మూడో స్థానంలో నారాయణపేట డిపో, 93.70 శాతంతో మహబూబ్‌నగర్ డిపో నాలుగో స్థానంలో నిలిచాయి. గద్వాల, షాద్‌నగర్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. లక్ష్య చేధనలో నాగర్‌కర్నూల్ డిపో చివరిస్థానంలో నిలిచింది. ఆపరేషన్ రేషియోను పరిశీలిస్తే 74 శాతంతో ముందంజలో నిలిచింది. ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తున్నది. వనపర్తి డిపోలో 482 మంది ఉద్యోగులు ఉండగా వారి జీతభత్యాలు పోనూ ఆదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో గొప్ప మార్పుగా చెప్పొచ్చు. ఈ డిపోకు సంబంధించి 32 రూట్లల్లో నిత్యం 110 బస్సులను నడుపుతున్నారు. అందులో 45 ఆర్టీసీ బస్సులు.. 65 హైర్ బస్సులు తిప్పుతున్నారు.
సమిష్టి కృషితోనే డిపో నష్టాలు త గ్గుతున్నాయి. అంకిత భావంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తున్నాయి. దీ నికితోడు ఎండీ సజ్జనార్ చేపట్టిన సం స్కరణలు సంస్థను లాభాల బాట పట్టిస్తున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని మం చి ఫలితాలు సాధిస్తాం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లో విజయం సాధిస్తామన్నారు. రూ. 10 కోట్ల నష్టాన్ని తగ్గించగలగడం, ఒ క్క నెలలో దాదాపు రూ.2 కోట్లకుపైగా లాభం రా వడం.. అక్టోబర్‌లోనూ లాభాలు వస్తుండడం హర్ష ణీయం. బస్స్టేషన్లు, బస్సులు క్లీన్‌గా ఉం చుతున్నామని అన్నారు. ప్రయానికులు అసౌకర్యానికి గురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వనపర్తి ఆర్టీసీ స్థల వివాదం ముగిసింది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ప్రయాణికులు మరింత సహకారం అందించాలి. గురువారం డయ ల్ యువర్ డీఎంలో సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలి.
-జీ.పరమేశ్వరి, డిపో మేనేజర్