శ్రీశైలం, అక్టోబర్ 19 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 80,400, విద్యుదుత్పత్తి నుంచి 20,717, సుంకేసుల నుంచి 51,732, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు విడుదల చేశారు. కాగా, బుధవారం సాయంత్రం శ్రీశైలం రిజర్వాయర్‌లో 2,54,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ఏడు గేట్లతో 1,94,922, కుడిగట్టు విద్యుదుత్పత్తి నుంచి 30,719, ఎడమగట్టు విద్యుదుత్పత్తి నుంచి 35,315 క్యూసెక్కులను సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
అమరచింత, అక్టోబర్ 19 : జూరాల ప్రాజెక్టుకు వ రద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బుధవారం సా యంత్రం 1.48 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. డ్యాం 20 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. బీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, విద్యుదుతృత్తికి 20,717 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ఎడుమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడి కాల్వకు 770 క్యూసెక్కులు వినియోగిస్తుండగా.. మొత్తంగా 1,02,879 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, అక్టోబర్ 19 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద నిలకడగా వచ్చి చేరుతున్నది. బుధవారం ఇన్‌ఫ్లో 27,411, అవుట్‌ఫ్లో 29,507 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 105.788 టీఎంసీలు నిల్వ ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 74,470 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. 74,000 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రధాన కాల్వకు 470 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ఆనకట్టలో 12 అడుగుల మేర నీటిమట్టం ఉన్నది.