e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home జోగులాంబ(గద్వాల్) అణగారినవర్గాల ఆశాజ్యోతి ఫూలే

అణగారినవర్గాల ఆశాజ్యోతి ఫూలే

  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
  • ఘనంగా జ్యోతిరావు ఫూలే వర్ధంతి

అచ్చంపేట, నవంబర్‌ 28: బహుజనుల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా అచ్చంపేట ఎన్టీఆర్‌ స్డేడియంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దర్శకుడని పేర్కొన్నారు. కిందిజాతుల విముక్తి కోసం పోరాటం చేసిన మహానుభావుడని కొనియాడారు. భారతదేశ చరిత్రలో కులాన్ని దాని మూలాన్ని వివరించిన దాత్రికుడని, 150ఏళ్ల కిందనే స్త్రీ విద్య కోసం ఆలోచించిన మేధావని కొనియాడారు. పేదల బతుకులు చీకటి నుంచి వెలుగువైపు వెళ్లాలని కోరుకున్న మహానుభావుడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, సర్పంచ్‌ లోక్యనాయక్‌, కౌన్సిలర్లు అంతటిశివ, సోమ్లానాయక్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు పర్వతాలు, క్రికెట్‌ క్రీడాకారులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

కొల్లాపూర్‌ మండలంలో..
భారతదేశంలో తొలి మహాత్మ బిరుదాంకితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం తమ జీవితార్పణ చేసిన మహనీయుడని బహుజన జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధ్దంతి కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలో ఫూలే విగ్రహానికి జేఏసీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక, కర్షక, తాడిత, పీడిత, మహిళా విముక్తి కోసం అహర్నిశలు పాటుపడిన క్రాంతిజ్యోతి అని, తన సర్వస్వాన్ని ధారపోసి జీవితాంతం విద్యాజ్యోతి కోసం పాటుపడిన ఆణిముత్యం ఆదర్శశీలి, తరతరాలకు స్ఫూర్తి ఫూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనే ధ్యేయంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశంలో 56శాతానికిపైగా ఉన్న బీసీల జనగణన వెంటనే చేపట్టి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీల సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడిన అంబ్కేదర్‌ శిష్యుడు బీపీ మండల్‌ ప్రతిపాదించిన 39 ప్రతిపాదనను అమలుపర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు జగదీశ్వరుడు, బహుజన జేఏసీ చైర్మన్‌ మేకలరాముడుయాదవ్‌, జేఏసీ కన్వీనర్లు బచ్చలకూర బాలరాజు, మద్దెల రాందాసు, టీఎన్జీవో జిల్లా సహ అధ్యక్షుడు సత్యనారాయణయాదవ్‌, చంద్రయ్యయాదవ్‌, కలర్‌మహేశ్‌, జావేద్‌, అశోక్‌ పాల్గొన్నారు.

- Advertisement -

పెద్దకొత్తపల్లి మండలంలో..
మండలంలోని పెద్దకారుపాముల, పెద్దకొత్తపల్లి గ్రామాల్లో జ్యోతిరావు ఫూలే వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు ఎల్లయ్య, రామస్వామి మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన చేసిన సేవలే నేడు గుర్తున్నాయని, ఆయన ఆశయ సాధనకోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో శివ, మహేశ్‌, మల్లేశ్‌, రాముడు, పరమేశ్‌ తదితరులు ఉన్నారు.

పెంట్లవెల్లి మండలంలో..
మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 131 వర్ధంతిని ఆదివారం వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఆస్‌ మండల యూత్‌ నాయకులు ముబీన్‌, కేశవులు, కుమార్‌, మద్దిలేటి, రవి తదితరులు పాల్గొన్నారు.

అచ్చంపేట పట్టణంలో..
పట్టణంలోని కొత్త బస్టాండ్‌ అమరవీరుల స్థూపం వద్ద మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్ల నర్సింహగౌడ్‌ పాల్గొని జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు నిరంజన్‌, కాశన్న యాదవ్‌, రమాకాంత్‌, సిద్ధ్దార్థ, మహబూబ్‌అలీ, కౌన్సిలర్‌ సోమ్లానాయక్‌, విష్ణు, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

కోడేరు మండలంలో..
మండల కేంద్రంలోని ఊరగుట్ట కాలనీలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతిని యువకులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మల్లేశ్‌, పబ్బతిభాను, మహేశ్‌, రాము, యాదగిరి, వంశీ, యాగదిరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బల్మూర్‌ మండలంలో..
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలను ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, విండో చైర్మన్‌ నర్సయ్య, సీఈవో రావజవర్ధన్‌రెడ్డి, తాసిల్దార్‌ కిష్ట్యానాయక్‌, సర్పంచులుఉన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement