గద్వాల, అక్టోబర్ 7 : నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు రిజర్వాయర్. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో సు మారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. 2014కు ముందు నెట్టెంపాడు ద్వారా 20 వే ల ఎకరాలకు సాగునీరు అందేది. తెలంగా ణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అధికారంలో కి వచ్చి జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించా రు. ఎనిమిది ఏండ్లలో నెట్టెంపాడు ప్రాజెక్టుకు రూ.603 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కాల్వ లు అభివృద్ధి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు పనులు పూర్తి చేశారు.
ప్ర స్తుతం జిల్లాలో 1.42లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న ది. నెట్టెంపాడు రిజర్వాయర్ పరిధిలోని చెరువులను నింపడం తో రైతుల పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దీంతో జిల్లాలోని ఎనిమిది మండలాలు సస్యశ్యామలంగా మా రాయి. ఎక్కడ చూసినా పచ్చని పంటలు కళకళలాడుతున్నా యి. గతంలో ఈ ప్రాంతంలో సాగునీరు లేక రైతులు వలస వెళ్లేవారు. ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా అందడంతో పంట లు బాగా పండుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటల కోతల సమయంలో ఇతర రాష్ర్టాల కూలీలు ఇక్కడికి వలసలొస్తున్నారు. జూరాల బ్యాక్‌వాటర్ కింద వరద సమయంలో నిత్యం 3వేల క్యూసెక్కుల నీటిని 90 రోజులపాటు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని 8 మండలాల రైతుల పొలాలకు నెట్టెంపాడు రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. రిజర్వాయర్ పంపుల ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసి 104చెరువులు నింపుతున్నారు. 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నెట్టెంపాడు లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. రిజర్వాయర్ పూర్తి అంచనా వ్యయం రూ.2400 కోట్లు. ప్రస్తుతం ఈ లిఫ్ట్ ద్వారా 1.42లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. 99,100ప్యాకేజీ పనులు పూర్తయితే 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఆ రెండు ప్యాకేజీ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
నెట్టెంపాడు పరిధిలో ఆయకట్టు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.21కోట్లు విడుదల చేయడంతో రోడ్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.